ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ప్రజా సంక్షేమం అనే కోణంలోనే.. ప్రభుత్వం ప్రతీ నిర్ణయాన్ని తీసుకుంటోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో కీలక మార్పులు, పరిణామాలు చవిచూశాయని గుర్తు చేసారు. పరిమిత వనరులు దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు. ఏడాదికి రూ.33వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ లక్ష్యాలను.. సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ఇరు సభలనుద్దేశించి ప్రసంగించారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోందని వివరించారు. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 5,757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. మత్స్యకార సేవలో పథకం ద్వారా 1.2 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. లక్ష మందికి పైగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్ అందిస్తోందని గవర్నర్ చెప్పారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత
2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత ప్రజల కూటమికి అప్పజెప్పారని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ప్రభుత్వ పాలన అద్భుతంగా సాగుతోందని. 19 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని పునర్నిర్మించి గాడిలో పెట్టింది. రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రీస్టార్ట్ అయ్యాయని తెలిపారు. తొలి 9 నెలల కాలంలో దిద్దుబాటు చర్యలు, పాలసీలు, వ్యవస్థ పునరుద్ధరణ వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసి పారదర్శకమైన పాలనను కూటమి ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పాలన సాగిస్తోందన్నారు. పది సూత్రాలను నిర్దేశించుకుని.. ప్రజలకు సుపరిపాలన అందించాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా చేసుకుని ప్రభుత్వ పాలన సాగుతోందని అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. త్వరలోనే కుటుంబ కార్డు అందజేయబడింది. అందరికీ ఇల్లు.. అనే లక్ష్యంతో గృహ నిర్మాణ సంస్థ ప్రభుత్వం చేపడుతోందని గవర్నర్ వివరించారు. IT, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి రంగాల్లో దూసుకెళ్తోందని గవర్నర్ గురించి.
-

గవర్నర్ ప్రసంగం వేళ వైసీపీ నిరసన, నినాదాలు – సభలో ఆ వెంటనే..!!
-

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం కీలక నిర్ణయం- ఈ సమావేశాల్లోనే…!!
-

ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు, జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు..!!
-

175 నియోజకవర్గాలకు ర్యాంకుల ప్రకటన, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు…!!
-

కొన్ని లోపాలు ఉన్నాయి,ఉదాసీనత వీడండి- పవన్ కీలక వ్యాఖ్యలు..!!
-

175 నియోజకవర్గాల్లోనూ, ఇక నుంచి – టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!!
-

ఉద్యోగుల పదవీ విరమణ, పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు – ఇక పై ఇలా..!!
-

మందు బాబులకు బ్యాడ్ న్యూస్- వైన్స్, బార్లు బంద్, ఎప్పటి వరకు..!!
-

Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్టుపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
-

దుబాయ్‌లో ఇల్లు కొనడం ఇక ‘ఆన్లైన్ షాపింగ్’ అంత ఈజీ! ఒకే క్లిక్‌తో..!!
-

2024 YR4: ఆ రోజు ఆకాశం మారిపోతుందా? చంద్రుడిని ఢీ కొట్టనున్న గ్రహ శకలం!
-

కాలేజీలోనూ విద్యార్థినులకు ప్రసూతి సెలవులు: హైకోర్టు సంచలన తీర్పు!
-

మహా శివరాత్రి ప్రత్యేక దర్శనం, కోటప్పకొండ పిలుస్తోంది.
-

ప్లకార్డులతో జగన్ నిరసన, కీలక డిమాండ్ – హెచ్చరిక..!! వీడియో
-

today rashiphalalu: నేడు వీరికి డబ్బులకట్టలు.. రాసిపెట్టుకోమన్న ముఖ్య గ్రహాలు!
















