రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కే.ఈ
పత్తికొండ టౌన్, ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్):
పత్తికొండ పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్లను పురస్కరించుకుని నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్–2026ను పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ 07-02-2026 నుండి 09-02-2026 వరకు పత్తికొండలోని సొసైటీ బ్యాంక్ గ్రౌండ్ (SST) లో నిర్వహించబడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణతో పాటు ఐక్యత పెరుగుతుందని తెలిపారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.50,000/-, రెండవ బహుమతిగా రూ.30,000/-, మూడవ బహుమతిగా రూ.20,000/- మరియు నాల్గవ బహుమతిగా రూ.10,000/- అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువకులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

