Sunday, March 22, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణగరికపాటి వివాదం: పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి కానీ అవమానిస్తారా? |...

గరికపాటి వివాదం: పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి కానీ అవమానిస్తారా? | గరికపాటి వివాదం: మధ్యాహ్న భోజనంపై గరికపాటి చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ మండిపడ్డారు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం పైన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని చూడాలని కొందరు చెబుతుంటే, మరికొందరు ఆయన అత్యంత అభ్యంతరకరమైన భాషను ఉపయోగించరని మండిపడుతున్నారు. గరికపాటి స్థాయికి తగిన మాటలు కావని చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గరికపాటి విజ్ఞత అది: ఏపీ స్టేట్ ఫుడ్ కమీషన్ చైర్మన్

తాజాగా ఈ అంశం పైన ఏపీ స్టేట్ ఫుడ్ కమీషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడం అనేది రాజకీయ నిర్ణయం కాదని, న్యాయస్థానాల ప్రకారం పేద విద్యార్థులకు ఇది ఒక హక్కుగా మారిందని ఆయన స్పష్టం చేశారు. గరికపాటికి ఈ పథకం వివరాలు పూర్తిగా తెలిసి ఉండవని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తామని పేర్కొన్నారు.

గరికపాటి వివాదం మధ్యాహ్న భోజనంపై గరికపాటి వ్యాఖ్యలపై రాష్ట్ర ఆహార కమీషన్ ఛైర్మన్ ధ్వజమెత్తారు

మధ్యాహ్న భోజన పథకం పిల్లల జన్మహక్కు

మధ్యాహ్న భోజనం పిల్లల జన్మహక్కు అని విలాసం కాదని విజయ్ ప్రతాప్ రెడ్డి తేల్చి చెప్పారు. గతంలో సుప్రీం కూడా ఈ విషయాన్ని చేసింది. ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని, జీవించే హక్కు అంటే కేవలం బతకడమే కాదని గౌరవప్రదంగా ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకుని బ్రతకడం అని ఆయన గుర్తు చేశారు.

కడుపు ఖాళీగా ఉంటే పిల్లలు చదువులపై శ్రద్ధ పెట్టలేరు

ఇది అందరి హక్కు అని ఆయన చెప్పారు. కడుపు ఖాళీగా ఉంటే పిల్లలు చదువు పైన శ్రద్ధ పెట్టలేరు, మధ్యాహ్న భోజనం లేకుండా విద్యాహక్కు చట్టం లక్ష్యం నెరవేరదని ఆయన కలిగి ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకం కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని తెలిపిన ఆయన ఈ పథకం అమలయ్యే వ్యయంలో 60 శాతం కేంద్రానిది, 40 శాతం రాష్ట్రానిది అని పేర్కొన్నారు.

పేదరికంలో ఉన్న వారి కోసం ఈ పథకం

నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు కోసం ఒక కమీషన్‌ను నియమించినట్లుగా చెప్పారు ఆయన మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయడం కోసం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ఎదిగే పిల్లల కోసం, పేదరికంలో ఉన్న వారి కోసం ఈ పథకం ద్వారా వారంలో ఐదు రోజులు ఐదు గుడ్లు ఇస్తున్నారని, దీనిని కూడా విమర్శించడం తమను చాలా బాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యలు బాధాకరం

ఎవరైనా విద్యార్థికి ఒక పూట బాయిల్డ్ ఎగ్ ఇవ్వలేదని, ఒకపూట భోజనం పెట్టలేదని పిటిషన్ దాఖలు చేస్తే 125% ఫైన్ వేస్తున్నామన్నారు. సుమోటోగా కేసులను సైతం నమోదు చేస్తున్నామని విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిత్య పెళ్లికొడుకు, శోభనం పెళ్లికొడుకు, గాడిదగుడ్డు వంటి వ్యాఖ్యలు చాలా బాధించాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మీకు పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి తప్ప అవమానకరంగా మాట్లాడొద్దని ఆయన ఘాటుగా స్పందించారు.

పేదరికాన్ని కించపరిచేలా గరికపాటి వ్యాఖ్యలు

పేద పిల్లలు మనకు లెక్క లేరా? వాళ్లు మన దేశానికి వెన్నెముక కాదా.. వాళ్లే మన భవిష్యత్తు కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు.గరికపాటి చేసిన వ్యాఖ్యలు మధ్యాహ్న భోజన వసతి మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలలను, పేదరికాన్ని కూడా కించపరిచేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular