Saturday, March 14, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఅలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !! | పెట్రోలియం...

అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !! | పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించిన బుకింగ్ ఈ కాలానికి ముందు కొనసాగదు

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏది ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీద దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు ఇదే పరిస్థితి తలెత్తింది. వంట వండటానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.

ఈ పరిణామాల మధ్య పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో సమావేశంలో మాట్లాడారు. దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, ఇంధన లభ్యతను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాలలో ఎల్‌పీజీ లభ్యత ఆందోళన దేశంలో ఉన్నా, రిటైల్ స్టేషన్లలో నిల్వలు అడుగంటినట్లు ఫిర్యాదులు లేదా నివేదికలు లేదా అందాయని స్పష్టం చేశారు.

పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ కాలానికి ముందు ఉంటే బుకింగ్ పునరుద్ఘాటించబడదు

ఎల్‌పీజీ లభ్యతను స్థిరీకరించడానికి, సిలిండర్ల అక్రమ నిల్వలను అరికట్టడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేశామని ఆమె వివరించారు. ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్‌, రిటైల్ అవుట్‌లెట్ ఆకస్మిక తనిఖీలు, దాడులు చేపట్టామని, రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయని తెలిపారు. ఒక్క శుక్రవారం నాడే సుమారు 1,300 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు.

ఇటీవలి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి పెరిగిందని, ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం నేడు ఉత్పత్తి 31 శాతం వరకు పెరిగిందని సుజాత శర్మ పేర్కొన్నారు. సరఫరా ఒత్తిళ్లను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని ప్రారంభించామని అన్నారు.

పట్టణ ప్రాంతాలలో చివరి డెలివరీ, తదుపరి బుకింగ్‌కు మధ్య 25 రోజుల కనీస గడువు తప్పనిసరి అని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజుల వరకు ఉంటుంది. ఈ నిర్దేశిత గడువు ముగియనిదే బుకింగ్ సాధ్యం కాదని సుజాత శర్మ వివరించారు. గ్యాస్ బుకింగ్ కోసం వినియోగదారులు ఐవీఎస్, ఎస్ఎంఎస్, వాట్సాప్.. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అందించే మొబైల్ యాప్‌లు వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించాలని సుజాత శర్మ సూచించారు.

సిలిండర్ బుకింగ్ లేదా డెలివరీ కోసం వ్యక్తిగతంగా పంపిణీ కేంద్రాన్ని సందర్శించి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆయిల్ తయారీ కంపెనీలు ఎప్పటిలాగే సిలిండర్లను ఇంటి వద్దకే అందిస్తాయి, కాబట్టి ఆందోళన అనవసరమని ఆమె భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరత షార్టేజ్ వార్తల్లో వాస్తవం లేదని, సిలిండర్లు నిర్దేశిత గడువులోగా ఇంటివద్దకే అందని ఆమె పునరుద్ఘాటించారు.

కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కొత్త ఉత్తర్వు జారీ చేసిందని, దీని ప్రకారం ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని పరిశ్రమలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర సంస్థలకు సహజ వాయువు బదులుగా బయోమాస్-డిరైవ్డ్ (రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ – RDF) పెల్లెట్‌లను ఒక నెల పాటు తాత్కాలికంగా ఉపయోగించడానికి అనుమతి లభించిందని ఆమె పేర్కొంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular