Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకేరళలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. | రాహుల్ గాంధీ కేరళ అసెంబ్లీ ఎన్నికల...

కేరళలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. | రాహుల్ గాంధీ కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 5 UDF హామీలను ఆవిష్కరించారు: ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్లు & మరిన్ని

📰 Generate e-Paper Clip


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ UDF కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ5 గ్యారంటీలను ప్రకటించారు. కేరళ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల రూ. 1000 అందజేత, వెల్ఫేర్ పెన్షన్ రూ. 3,000 లకు పెంపు, ఇక ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ .. దానితో పాటు బిజినెస్ చేసుకునే యువతకు రూ. 5 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేత.. అలాగే సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఇలా 5 గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించారు.

కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తరపున ప్రచారాన్ని వేగవంతం చేశారు. అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) చేపడుతున్న సంక్షేమ పథకాలకు పోటీగా రాహుల్ గాంధీ పలు కీలక హామీలను ప్రకటించారు. ఐదు గ్యారంటీల పేరుతో ఈ పథకాలను తీసుకొచ్చారు.

కేరళలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే UDF ప్రధాన లక్ష్యమని రాహుల్ స్పష్టం చేశారు. LDF ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు రావడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని రైతులు, కార్మికులు, యువత నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే UDF మ్యానిఫెస్టోను రూపొందించిందని రాహుల్ గాంధీ తెలిపారు. కనీస ఆదాయ హామీ పథకం (NYAY) ద్వారా పేదలకు నేరుగా నగదు బదిలీ ఇవ్వబడింది. ప్రస్తుతం పినరయి విజయన్ ప్రభుత్వం అందించే రేషన్ కిట్లు, పెన్షన్ల కంటే ఈ పథకం బెటర్ అని రాహుల్ గాంధీ చెప్పారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు 5 UDF హామీలను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు ఉచిత బస్సు ప్రయాణ పెన్షన్లు amp More

పినరయి విజయన్ ప్రభుత్వం కేవలం తమ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ ఉద్యోగాలను కట్టబెడుతోందని.. అర్హులైన యువతకు అన్యాయం జరుగుతోందని రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించారు. KSRTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల రూ.1,000.. అలాగే వెల్ఫేర్ పెన్షన్ రూ.3,000లకు పెంపు.. ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. బిజినెస్ చేసే యువతకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణాల పథకాలు ఉన్నాయి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular