Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! | మంత్రి...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! | మంత్రి నిమ్మల శుభవార్త.. ఇరిగేషన్ కెనాల్ మానిటరింగ్ కోసం లస్కర్ వేతనాన్ని ₹350 నుంచి ₹550కి పెంచారు.

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలవనరుల శాఖలో పనిచేస్తున్న కష్టజీవులకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త తెలిపారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి వారి వేతనాలను పెంచారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొరుగు సేవ లస్కర్ ల పారితోషకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు జీతాల పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

సాగునీటి కాలువల నిర్వహణలో, పర్యవేక్షణలో లస్కర్ లు

రాష్ట్రంలో వివిధ డెటా వ్యవస్థలు ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న లస్కర్లకు ఇచ్చే వేతనం ప్రతిరోజు 350 రూపాయలుగా ఉంది. లస్కర్ లు సాగునీటి కాలువల నిర్వహణలో, పర్యవేక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారు. నీటి, కాలువలకు అడ్డుపడిన తూడు తొలగింపు, ఆక్విడెక్ట్‌లు, ప్రాజెక్టుల వద్ద పహారా, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం వంటి అత్యవసర బాధ్యతలను లస్కర్ లు నిర్వర్తిస్తారు.

మంత్రి నిమ్మల శుభవార్త ఇరిగేషన్ కెనాల్ మానిటరింగ్ కోసం లస్కర్ వేతనాలను 350 నుంచి 550కి పెంచారు.

దైనందిన వేతనాన్ని 350 రూపాయల నుంచి 550 రూపాయలకు పెంపు

చాలా రిస్క్ తో కూడుకున్న ఈ బాధ్యతలను నిర్వర్తించే లస్కర్ లకు ఇచ్చే వేతనం వారికి చాలీచాలని ఉండటంతో వారి సమస్యలపై దృష్టి సారించిన మంత్రి నిమ్మల రామానాయుడు వారికి ఇచ్చే దైనందిన వేతనాన్ని 350 రూపాయల నుండి 550 రూపాయలకు ఇచ్చారు. ఈ తాజా నిర్ణయంతో ప్రతి లస్కర్ నెలకు అదనంగా 6000 రూపాయల జీతం లభించనుంది.

2025- 26 ఎస్ఓఆర్ రేట్ల ప్రకారం వేతనాల పెంపు

చాలాకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జల వనరుల శాఖలో ఖాళీలు భర్తీ కాకపోవడం, సిబ్బంది కొరతతో పాటు అరకొర జీతాలతో వీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం వంటి సమస్యలను చూస్తున్నారు. లస్కర్ ల దీర్ఘకాల డిమాండ్ ను తీసుకోవాలని ప్రభుత్వం 2025- 26 ఎస్ఓఆర్ రెట్ల ప్రకారం వారి వేతనాలను పెంచాలని నిర్ణయం తీసుకుంది.

మాట ఇచ్చిన నిలబెట్టుకున్న నిమ్మల రామానాయుడు

ఈ కోరికనే అసెంబ్లీ వేదికగా లస్కర్ ల వేతనాల పైన హామీ ఇచ్చిన నిమ్మల రామానాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీంతో ఈ పెంపుపై లస్కర్ లు హర్షం వ్యక్తం చేస్తూనే, ఖాళీగా ఉన్న పోస్టులను కూడా వెంటనే మార్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular