Thursday, March 5, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణట్రంప్ అసాసినేషన్ కు ఇరాన్ ప్లాన్- పాకిస్తానీ హ్యూమన్ వెపన్ | ఇరానియన్ ఆపరేటివ్‌లు తనను...

ట్రంప్ అసాసినేషన్ కు ఇరాన్ ప్లాన్- పాకిస్తానీ హ్యూమన్ వెపన్ | ఇరానియన్ ఆపరేటివ్‌లు తనను ట్రంప్, బిడెన్ మరియు హేలీకి రిక్రూట్ చేశారని పాకిస్థాన్ జాతీయ ఆసిఫ్ మర్చంట్ క్లెయిమ్ చేశాడు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టలేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.

ఈ పరిస్థితుల్లో ఓ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర పన్నాడనే కారణంతో ఓ పాకిస్థాన్ జాతీయుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు ఆసిఫ్ మర్చంట్. ఇరాన్ ప్రకారం తాను ఈ ఆపరేషన్ కు దిగానని విచారణ సందర్భంగా అంగీకరించాడు. ట్రంప్ తో పాటు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్, నిక్కీ హెలీని అంతమొందించడానికి తనను హ్యూమన్ వెపన్ గా ప్రవేశపెట్టారని తెలిపాడు.

ఇరానియన్ ఆపరేటివ్‌లు తనను ట్రంప్ బిడెన్ మరియు హేలీకి రిక్రూట్ చేశారని పాకిస్థాన్ జాతీయ ఆసిఫ్ మర్చంట్ క్లెయిమ్ చేశాడు

దీనికి న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బుధవారం బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా అతని వాంగ్మూలాన్ని చదివి వినిపించారు. ఇరాన్ గూఢచారులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, నిక్కీ హెలీలను హత్యకు నియమించారని చెప్పారు. తన కుటుంబాన్ని చంపేస్తామంటూ ఇరాన్ గూఢచారులు బెదిరించడంతో దీనికి అంగీకరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. తనకు వేరే మార్గం లేదు.

ఆసిఫ్ మర్చంట్ కిరాయి హంతకుడని ముందుగా అండర్‌కవర్ ఎఫ్‌బీఐ ఏజెంట్లు గుర్తించారని, అనంతరం అతని కదలికపై నిఘా ఉంచి, దీన్ని నిర్ధారించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించారు. ట్రంప్, బైడెన్, నిక్కీ హెలీ హత్యకు 5,000 డాలర్లు ఆఫర్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.

ఆసిఫ్.. మాజీ బ్యాంకర్. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2024 ఏప్రిల్‌లో ఇరాన్‌కు చెందిన ఓ ఏజెంట్ తనను సంప్రదించాడని అతను తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అమెరికా వెళ్లి ఒకరిని హత్య చేయాలని చెప్పారే తప్ప పేర్లు వెల్లడించలేదని చెప్పాడు. ఆ తర్వాత ట్రంప్, బైడెన్, హేలీ అనే ముగ్గురి పేర్లను తనకు ఇచ్చారని, వారిని హత్య చేయకపోతే కుటుంబాన్ని చంపుతామని బెదిరించారని లిఖితపూరకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఈ అసాసినేషన్ ఆపరేషన్‌లో తాను సక్సెస్ అవుతానని ఏనాడూ అనుకోలేదని, అరెస్టునని అవుతానని ఊహించానని ఆసిఫ్ మర్చంట్ తెలిపాడు. ఇలా చేయడం వల్ల అమెరికన్ గ్రీన్ కార్డ్ లభిస్తుందని వివరించారు. ఈ కేసులో అతడు దోషిగా తేలితే, జీవిత ఖైదును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular