వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. భారీగా పెరిగిన మరుసటి రోజే ధరలో డౌన్ ట్రెండ్ కనిపించింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, దేశీయ బులియన్ మార్కెట్లు వారంలో తొలి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో చూశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నప్పటికీ, భారతీయ బంగారు ధరలలో మాత్రం లాభాల స్వీకరణ కనిపించింది. ఫలితంగా వీటి రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఈ ఉదయం ప్రారంభ సెషన్‌లో 25,000 రూపాయల వరకు తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 2,580 రూపాయల మేర తగ్గి 10 గ్రామాలకు 1,70,500 రూపాయలకు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి దూసుకుపోతున్నా ఈ అనూహ్య పతనం చోటుచేసుకోవడం. సోమవారం నాటి రేటుతో పోల్చుకుంటే ఒక గ్రాముకు సుమారు 258 రూపాయల మేర తగ్గుదల రికార్డు అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 2,350 తగ్గింది రూ. 1,56,300 వద్ద ఉంది. 18 క్యారెట్లు 10 గ్రాములకు 1,930 రూపాయలు తగ్గి 1,27,880 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో, రాబోయే ట్రేడింగ్ సెషన్‌లో బంగారం ధరలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడుల భద్రత కోసం పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ అస్థిరత మరింత తీవ్రంగా కొనసాగే అవకాశం ఉంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 17,073, 22 క్యారెట్లు – రూ. 15,650, 18 క్యారెట్లు – రూ. 13,400
ముంబై..
24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 17,002, 22 క్యారెట్లు- రూ. 15,585, 18 క్యారెట్లు – రూ. 12,752