అంతర్జాతీయ
ఓయి-లింగారెడ్డి గజ్జల
అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న ‘మైండ్ గేమ్’ ఇప్పుడు బీజింగ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతోంది. కేవలం రెండు స్వల్ప వ్యవధిలో, చైనాకు అత్యంత సన్నిహితమైన ఇద్దరు ‘చమురు’ను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. ఇది కేవలం దౌత్యపరమైన దెబ్బ మాత్రమే కాదు.. చైనా ఆర్థిక వ్యవస్థను నడిపించే ఇంధన సరఫరా గొలుసుపై వేసిన పెను వేటు.
జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా తన అదుపులోకి తీసుకోవడం ఒక సంచలనం, ఫిబ్రవరి చివరిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం చైనాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. దక్షిణామెరికాలో ఒకరు, మధ్యప్రాచ్యంలో మరొకరు.. చైనాకు వెన్నుముకలా నిలిచే ఈ ఇద్దరు దేశాన్ని కోల్పోవడంతో డ్రాగన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

లెక్కలు తేల్చిన ‘క్ప్లెర్’ (Kpler)
చైనాకు అందే ముడి చమురులో దాదాపు 15 శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తుంది. డేటా అనలిటిక్స్ సంస్థ ‘క్ప్లెర్’ ప్రకారం.. వెనిజులా ఎగుమతి చేసే చమురులో సగానికి పైగా, ఇరాన్ పంపే చమురులో దాదాపు మొత్తం చైనాకే చేరుతుంది. ఇప్పుడు ఈ సరఫరా మార్గాలన్నీ అమెరికా కబంధ హస్తాల్లోకి వెళ్లడంతో, బీజింగ్ ఇంధన ఆకలిని తీర్చే మార్గం మూసుకుపోయింది.
ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ కట్!
టార్టాయిస్ క్యాపిటల్ పోర్ట్ ఫోలియో మేనేజర్ రాబ్ థమ్మల్ విశ్లేషణ ప్రకారం, ఈ సంక్షోభంలో చైనా ప్రధాన బాధితురాలు. “చైనా తన అవసరాలకు సరిపడా చమురును ఉత్పత్తి చేసుకోలేదు. ధరలు పెరిగితే ఆర్థిక వృద్ధి తగ్గుతుంది కానీ, అసలు చమురు సరఫరా నిలిచిపోతే ఆ దేశ యంత్రం మొత్తం ఆగిపోతుంది” అని ఆయన సూచించారు. భౌతిక సరఫరా దెబ్బతినడం అంటే చైనా ఆర్థిక వ్యవస్థకు అందుతున్న ఆక్సిజన్‌ను కట్ చేయడమే.

డ్రాగన్ ఆగ్రహం: ‘ఇది ఆమోదయోగ్యం కాదు’
ఈ పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నిప్పులు చెరిగారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులను “బరితెగించిన చర్య”గా ఆయన అభివర్ణించారు. “ఒకవభౌమ దేశ నాయకుడిని హత్య చేయడం, పాలన మార్పు కోసం రెచ్చగొట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు” అంటూ అంతర్జాతీయాలపై బీజింగ్ తన నిరసనను గొంతు చించుకుని చెబుతోంది. కానీ, అమెరికా వ్యూహాల ముందు చైనా కేకలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి.

