Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇరాన్ ప్రతీకారం: మంటల్లో అమెజాన్ డేటా సెంటర్.. 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి! |...

ఇరాన్ ప్రతీకారం: మంటల్లో అమెజాన్ డేటా సెంటర్.. 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి! | ఇరాన్ రివెంజ్, యుఎఇలో అమెజాన్ డేటా సెంటర్ ఫైర్, 97 క్షిపణులు మరియు 283 డ్రోన్ల దాడి కువైట్, వివరాలు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-జక్కీ మహేష్

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడుల్లో యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ దెబ్బతింది. దీంతో అమెజాన్ తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కువైట్, యూఏఈ (UAE) లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

అసలేం జరిగిందంటే?
అమెజాన్ క్లౌడ్ విభాగం AWS తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1, 2026 ఆదివారం తెల్లవారుజామున యూఏఈలోని డేటా సెంటర్‌లోకి ఏదో ఒక వస్తువు (మిస్సైల్ లేదా డ్రోన్ శకలాలు) వచ్చి బలంగా ఢీకొట్టింది. దీనివల్ల డేటా సెంటర్‌లో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి.. భారీగా మంటలు వ్యాపించాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ముందుజాగ్రత్త చర్యగా ఆ సెంటర్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసి, కార్యకలాపాలను పూర్తిగా మూసివేసినట్లు అమెజాన్ ధ్రువీకరించింది.

UAE 97 క్షిపణులు మరియు 283 డ్రోన్ల దాడిలో కువైట్‌లో అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు
ఇరాన్ తన దాడుల పరిధిని పెంచింది. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమైన ఈ ప్రతిదాడుల్లో యూఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్, దుబాయ్‌లోని జబేయ్ అలీ పోర్ట్ వంటి కీలక ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ వసతినే విమానాశ్రయాలు, రేవులు, నివాస ప్రాంతాలపై జరిగిన దాడుల ప్రభావంతో అమెజాన్ డేటా సెంటర్ కూడా మంటల్లో చిక్కుకుంది. దుబాయ్, అబుదాబి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు విన్నామని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

డేటా సెంటర్ మూసివేస్తే ఏమవుతుంది?
డేటా సెంటర్లు అనేవి ఇంటర్నెట్ ప్రపంచానికి వెన్నెముక స్థిర. ఇక్కడ లక్షలాది కంప్యూటర్ సర్వర్లు నిరంతరం పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్‌లు, యాప్‌లు, ఆన్‌లైన్ సేవలను నడిపిస్తాయి. ఈ ఘటన వల్ల AWS కి చెందిన EC2, డేటాబేస్ నెట్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ సెంటర్ మూతపడటంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఫుడ్ డెలివరీ యాప్‌లు, క్లౌడ్ ఆధారిత అప్లికేషన్‌లు నెమ్మదించాయి. వినియోగదారులు ఇతర ప్రాంతాలలో ఉన్న సర్వర్లను వాడాలని అమెజాన్ సూచించింది.

ఉద్రిక్త పరిస్థితులు
అమెరికా ఇరాన్‌పై జరిపిన దాడుల వీడియోలను విడుదల చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. మరోవైపు ఇరాన్ దాడులకు ఆంత్రోపిక్ క్లాడ్ AI వంటి అధునాతన సాంకేతికతను వాడుతోందనే వార్తలు కూడా టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో టెక్నాలజీ దిగ్గజాలు తమ మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ యుద్ధ వాతావరణం, ఇంటర్నెట్ అంతరాయం వారి జీవనశైలిని, కమ్యూనికేషన్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

కువైట్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్
సోమవారం తెల్లజామున ఇరాన్ భారీ విమానాల దాడులకు తెగబడింది. కువైట్ భూభాగంపై ఇరాన్ ఏకకాలంలో 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడికి దిగింది. రధానంగా చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాల కోసం ఈ దాడులు జరిగినట్లు సమాచారం. కువైట్ గగనతలం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. ఈ స్థాయిలో దాడులు జరగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular