Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఈయనే.. ఖమేనీ కంటే డేంజర్..! | అరాఫీ అయతుల్లా అలీరెజా...

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ ఈయనే.. ఖమేనీ కంటే డేంజర్..! | అరాఫీ అయతుల్లా అలీరెజా తదుపరి ఇరాన్ యొక్క తాత్కాలిక సుప్రీం నాయకుడిగా ఎంపికయ్యారు – సీనియర్ మతాధికారి బాధ్యతలు స్వీకరించారు

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. అయితే ఇరాన్ పై జరిపిన దాడుల్లో సుప్రీ లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. మరో ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లుగా. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన కేవలం 30 సెకన్లలోనే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతోపాటు పలువురు సీనియర్ అధికారులు హతం అయినట్టు సమాచారం. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించారు.

ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణాన్ని అటు ఇరాన్ మీడియాతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సుప్రీం నాయకుడిగా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఇరాన్ ప్రకటించారు. ఆయన తాత్కాలిక లీడర్‌గా పనిచేస్తారని సుప్రీం. ఇక ఇస్లామిక్ విప్లవ నేత ఖోమేనీ మరణం అనంతరం.. 1989 నుంచి ఖమేనీ ఇరాన్ సుప్రీం నాయకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇక ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం.. సుప్రీం లీడర్ మరణించినప్పుడు లేదా తన విధులను నిర్వహించలేని సమయంలో ఒక మధ్యంతర నాయకత్వ మండలి ను ఏర్పాటు చేస్తారు. ఈ మండలిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసేని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారు. ఇక ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. 88 మంది సభ్యుల ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అసెంబ్లీ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.

అరాఫీ అయతుల్లా అలీరెజా ఇరాన్ తాత్కాలిక సుప్రీం నాయకుడిగా తదుపరి సీనియర్ మతాధికారి బాధ్యతలు స్వీకరించారు

రష్యన్ మీడియా కథనం ప్రకారం.. అయతొల్లా అరాఫీ.. ఇరాన్‌లోని అత్యంత శక్తివంతమైన మతపరమైన నాయకుల్లో ఒకరు. 1959లో ఇరాన్‌లోని మేబోద్‌లో జన్మించిన ఆయన షియా మతగురువుగా.. ఇస్లామిక్ న్యాయనిపుణుడిగా పేరు పొందారు. దేశ చట్టాలు, ఎన్నికలను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్‌లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే గతంలో ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు అయతొల్ల అరాఫీ.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular