అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జైంట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. ఇరాన్, ఇజ్రాయెల్ లల్లో నివసించే పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలను మానుకోవడం లేదా వాయిదా వేసుకోవాలని కోరింది. ఈ మేరకు విదేశీ మంత్రిత్వ శాఖ, ఇరాన్, ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ భారతీయులందరూ రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండటం.

పరిస్థితులు చేయి దాటుతున్నాయని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సంచారాన్ని నియంత్రించుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. ఈ నేపథ్యంలో రాయ వాట్సాప్ సర్వీస్‌లతో సహా బార హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటైంది. వెనిజులలో నెలకొన్న అనిశ్చిత, ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి వివరించింది. తదుపరి సూచనల మేరకు ఇరాన్, ఇజ్రాయెల్ లో నివసించే భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, తమను నిరంతరం సంప్రదిస్తూ ఉండాలని సూచించింది.
పౌరులు తమ నివాసం లేదా పని ప్రాంతంలో సమీపంలోని రక్షణ స్థలాలను తెలుసుకోవటానికి దగ్గరగా ఉండాలని, స్థానిక వార్తలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలని కోరింది. తాజా సమాచారం. https://www.oref.org.il/eng ను సందర్శించాల్సి ఉంటుంది. ఏ అత్యవసర పరిస్థితికైనా, 24×7 హెల్ప్‌లైన్ +972-54-7520711 లేదా (ఇమెయిల్ రక్షించబడింది) రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
సలహా
ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని మరియు అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2. భద్రతా మార్గదర్శకాలు మరియు సూచనలను ఖచ్చితంగా పాటించాలని భారతీయ పౌరులు గట్టిగా సలహా ఇస్తున్నారు… pic.twitter.com/SBWmNLgIsS— ఇజ్రాయెల్‌లో భారతదేశం (@indemtel) ఫిబ్రవరి 28, 2026
వ్యాపారం, ఇతర వ్యక్తిగత పనులపై ఇరాన్ కు వెళ్లిన భారతీయులు కూడా వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, అత్యంత జాగ్రత్తగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్ అధికారులు, హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరింది.

