అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
నిన్నటివరకు నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జైంట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఊహించని ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కిపడింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడి జనం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ డౌన్‌టౌన్‌లో భారీ పేలుడు జరిగి దట్టమైన పొగ అలముకుంది. పలు చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా-ఇరాన్ అణు చర్చల మధ్య ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ దాడులను ధృవీకరించారు కూడా. ప్రీవెంటివ్ మిస్సైల్ అటాక్ ను ప్రారంభించినట్లు తెలిపారు.

మొత్తం 30 నుంచి 40 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఆ దేశాధ్యక్షుడి భవనం, సైన్యాధికారుల కార్యాలయాలు/నివాసాలు, సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు.. ఇవన్నీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ దేశాలు గగనతలాన్ని మూసివేశారు. పౌర విమానాలేవీ కూడా అక్కడ తిరుగాడట్లేదు. టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించిన వెంటనే పైలట్లకు తక్షణమే హెచ్చరికలు జారీ అయ్యాయి.
సైనిక విమానాల కోసం మాత్రమే గగనతలను తెరిచి ఉంచారు. టెహ్రాన్ నగర వీధులన్నీ కూడా చెల్లాచెదురుగా కనిపించాయి. జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అక్కడి వరకే పరిమితం కాలేదీ దాడులు. ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యతొల్ల అలీ ఖమేనీ అధికారిక నివాసం సమీపంలోనూ సంభవించింది.
కజార్జా మరియు థావియర్ దరియాఫ్తీ ఆస్ ‘షనిద షడ్న్ ఆదాయ్ సింగన్డహ్ మరియు సాహ్ అన్ఫార్ హవాలీ మార్క్స్ #తహీరాన్، شنبه ۹ اسفند’#ఇరాన్ #టెహ్రాన్ #ఇజ్రాయెల్ pic.twitter.com/0k7sS0dRBV
— వాహిద్ ఆన్లైన్ (@Vahid) ఫిబ్రవరి 28, 2026
హైసెక్యూరిటీ జోన్‌గా పరిగణించబడే ఈ ప్రాంతం మొత్తం కూడా బాంబు పేలుళ్లతో అట్టుడికి పోయింది. ఖమేని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియరావట్లేదు. టెహ్రాన్ విడిచి వెళ్లినట్లు ప్రాథమికంగా అందిన సూచనలను బట్టి. టెహ్రాన్‌లో పేలుళ్లు, పొగలు ఆకాశంలోకి ఎగిసిపడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
బ్రేకింగ్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది. 💥
ఇది సుదీర్ఘ యుద్ధానికి నాంది కాదా?
ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
అమెరికా చేరుతుందా? pic.twitter.com/FvOKB3tEQn
— SL కాంతన్ (@Kanthan2030) ఫిబ్రవరి 28, 2026

