seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 4:37 am Digital Edition : SK NAZEER (Senior Journalist)

8_మంది_మెప్మా_ఉద్యోగులపై_వేటు

8_మంది_మెప్మా_ఉద్యోగులపై_వేటు

 

👉 పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు చెందిన 8 మంది ఉద్యోగులను పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ మెప్మా పీడీ మురళీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

👉 పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు, మెప్మా విభాగంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కలిసి నకిలీ గ్రూపులు సృష్టించారు.

 

👉 తద్వారా బ్యాంకుల్లో సుమారు రూ.4 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ అవినీతి గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. స్పందించిన సీఎం.. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, రికవరీ కాకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

 

👉 దీంతో నరసరావుపేట మెప్మా కార్యాలయంలో పనిచేసే సిటీ మిషన్ మేనేజర్ తుమ్మా దీప, కమ్యూనిటీ ఆర్గనైజర్ బి.విజయప్రణతి, సిటీ మిషన్ మేనేజర్ ఉమర్వలి (వినుకొండ), చిలకలూరిపేటకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం.మల్లికార్జునరావు, నరసరావుపేటకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ జి.భూదేవి, సిటీమిషన్ మేనేజర్ జి.శ్రీనివాసరావు (పిడుగురాళ్ల), గురజాల, పిడుగురాళ్లకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్లు కె.శ్రీనివాసరావు, డి.బాలాంజనేయులను సస్పెండ్ చేస్తూ పీడీ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడంపై డ్వాక్రా సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

👉 వైసీపీ హయాంలో దీప, ఉమర్ వలి, ప్రణతిలు నకిలీ గ్రూపులతో రుణాలు పొందారని ఆరోపణలు వచ్చినా వారికే కూటమి నేతలు ప్రాధాన్యమివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.