ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ నన్ను ఆశీర్వదించండి
ఎన్ఆర్ఐ లతో కలిసి వెల్దుర్తి మండలాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా
నవ యువ నాయకుడు ఈ ఎల్ అనిల్ కుమార్ గౌడ్
నవ యువ నాయకుడు ఈ ఎల్ అనిల్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రవేశం
వెల్దుర్తి, జనవరి 01,(సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా ఆదివారం రోజు మీడియా మరియు పత్రిక సమావేశం నందు యువ నాయకుడు రాజకీయ ప్రవేశం చేస్తూ ఈ.యల్. అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆలోచించి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మండలాన్ని అభివృద్ధి వైపు కొనసాగిస్తానని మరియు ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా నిస్వార్థంగా పనులు నిర్వహించి అభివృద్ధి వైపే మా యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించి ఆధునికంగా ప్రస్తుత పరిస్థితులను అధిగమిస్తూ ప్రజల యొక్క నిత్యవసరాలను తెలుసుకొని మురికి కాలువలు మరియు సిసి రోడ్లు పార్కులు నీటి కొళాయిలు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిర్విఘ్నంగా పనులు చేసి మండలాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేశాడు. కనుక ప్రజలందరూ మరియు గ్రామ పెద్దలు అందరూ నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం ఇవ్వగలరని తెలిపారు. నేను ఈ రాజకీయాలలోకి ఎటువంటి లాభాపేక్షంగానూ ఆశించకుండా గ్రామం యొక్క అభిమానంతో మిగతా ఎన్ఆర్ఐ లతో కలిసి మండలాన్ని అభివృద్ధి వైపు కొనసాగించగలనని తెలిపారు. నేను మరియు మా కుటుంబ సభ్యులు పలు దేశాలలో విధి నిర్వహణలో నిర్వహించి మండలం అభిమానంతో ఎటువంటి స్వార్థం లేకుండా పనులు నిర్విఘ్నంగా నిర్వహిస్తానని అందుకు అందరు సహకరించగలరని మనసారా కోరుకుంటున్నాను అని ఈ ఎల్ అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు.

