Wednesday, April 22, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణ"30 మున్సిపాలిటీలకుపైగా సులువుగా గెలుస్తామనుకున్నాం" | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ktr 30+ మునిసిపాలిటీలలో BRS...

“30 మున్సిపాలిటీలకుపైగా సులువుగా గెలుస్తామనుకున్నాం” | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ktr 30+ మునిసిపాలిటీలలో BRS సులువుగా గెలుపొందుతుందని అంచనా, కానీ కొంచెం తగ్గుదల

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామని అనుకున్నామని కానీ కొంత తగ్గిందని అన్నారు. హంగ్ వచ్చిన చోట కూడా మాకు అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్‌కు కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టింది కానీ.. క్షేత్రస్థాయిలో ప్రజలు వారికి ఆశించిన మున్సిపాలిటీలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

ఇక కరీంనగర్‌, నిజామాబాద్‌ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో ఇప్పటికే ఎస్‌ఈఎస్‌, ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు కేటీఆర్.

ఈ మేరకు ఎన్నికల్లో బీఎస్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలకు కొలమానం కాబోవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మన టార్గెట్ అసెంబ్లీ ఎన్నికల గురించి. ఈ మేరకు భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం అని కేటీఆర్ వివరించారు.

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలపై KTR on BRS 30 మున్సిపాలిటీలలో సులువుగా గెలుపొందుతుంది, కానీ స్వల్పంగా తగ్గింది

ఇక తెలంగాణాలో ఎంతో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈనెల 11న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 74 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ విజయకేతనం ఎగురవేసింది. అలాగే బీఆర్ఎస్ 17 చోట్ల విజయం సాధించింది. ఇక మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రభావం చూపలేక చతికిలపడింది. ఇక 24 చోట్ల హంగ్ ఏర్పడింది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular