seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 3:24 pm Digital Edition : SEEMA KIRANAM

30 ఏళ్లుగా ప్రజల సేవలో జ్ఞానేశ్వర్ గౌడ్ కుటుంబం..

వెల్దుర్తి సర్పంచ్ బరిలో కూటమి అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతి!

 

వెల్దుర్తి సర్పంచ్ కూటమి అభ్యర్థి ఎల్.ఈ. పుష్పావతికి వివిధ సామాజిక వర్గాల మద్దతు

 

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 11 (సీమకిరణం న్యూస్):

 

 

వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే బలపరిచిన నాయకుడు ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ సతీమణి ఎల్.ఈ. పుష్పావతి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తమ మద్దతు ప్రకటించారు. గత 30 ఏళ్లుగా ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ కుటుంబం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తోందని మద్దతుదారులు పేర్కొన్నారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు తదితర సమస్యలు తలెత్తినప్పుడు తన సొంత నిధులతో పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలను కలుపుకొని వారి కష్టసుఖాల్లో అండగా నిలిచారని వివరించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సుమారు 150 ఓట్ల ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరకు కేవలం రెండు ఓట్ల తేడాతో ఓటమి ఎదురైందని జ్ఞానేశ్వర్ గౌడ్ వర్గీయులు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయన సతీమణి ఎల్.ఈ. పుష్పావతి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడంతో వివిధ సామాజిక వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామం కోసం గతంలో సేవలందించిన వారి కృషిని ప్రజలు గుర్తించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకుడు వీరభద్రుడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు గిడ్డయ్య, ముస్లిం నాయకుడు ఖాజా, ఎంపీటీసీ శీను, కిట్టు, వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.