seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 11:08 am Digital Edition : SEEMA KIRANAM

2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. | పాకిస్తాన్ ఇంధన సంక్షోభం: పెట్రోల్ డీజిల్ కొరత మధ్య షెహబాజ్ షరీఫ్ 2 వారాల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు

అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఆ దేశాలే కాకుండా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. అయితే అసలే ఆర్థిక అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతాయని సమాచారం. దాంతో ఆ తర్వాత దేశం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ముందు జాగ్రత్తగా వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. ఇంటి నుండే పనులు చేసుకోవాలని.. ఆఫీసులకు రావొద్దని ఆదేశించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు.

పాకిస్తాన్ ఇంధన కొరత కారణంగా రెండు వారాల పాటు దేశంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హైయర్ ఎడ్యూకేషన్ సంస్థలు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారంలో 4 రోజులు మాత్రమే పని చేయాలని సూచించింది. అదనంగా 50 శాతం మంది ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని స్పష్టం చేసింది.

పాకిస్తాన్ ఇంధన సంక్షోభం పెట్రోల్ డీజిల్ కొరత మధ్య 2 వారాల పాఠశాలలకు సెలవులు ప్రకటించిన షెహబాజ్ షరీఫ్

మరోవైపు దేశంలో ఇంధన వినియోగం, నిల్వలపై సమీక్ష నిర్వహించాలని సంబంధిత శాఖలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాలు ఇచ్చారు. ఇంధన భారాన్ని తగ్గించుకునేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలలను రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇంధన సంక్షోభం కారణంగా ఈ ప్రధాని ఎమర్జెన్సీ నిర్ణయాలను షెహబాజ్ షరీఫ్ మార్చి 9న తీసుకున్నారు.

తాజా నిర్ణయంతో మార్చి 16 నుంచి దాదాపు రెండు వారాల పాటు పాఠశాలలను మూసి వేయనున్నారు. కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులకు ఆన్‌లైన్ విధానం బోధన ఆదేశాలు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇక ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ధరలను ఏకంగా 20 శాతం పెంచింది. దీంతో ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 321 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 335 గా ఉంది.

Source link