Wednesday, March 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణ175 నియోజకవర్గాలకు ర్యాంకుల ప్రకటన, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు...!! | AP ప్రభుత్వం సూచికల...

175 నియోజకవర్గాలకు ర్యాంకుల ప్రకటన, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు…!! | AP ప్రభుత్వం సూచికల పనితీరు, వివరాల ఆధారంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గ్రేడింగ్‌లను ప్రకటించింది

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

ఏపీ ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ర్యాంకులు ప్రకటించారు. ప్రధాన ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకులు ప్రకటించారు. కూటమి ఎమ్మెల్యేలు 164 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్నారు. అనేక కేటగిరీల వారిగా పలు అంశాల పైన నియోజకవర్గాల్లో పని తీరు ఆధారంగా ఈ ర్యాంకులను ఖరారు చేసారు. ర్యాంకులను అధికారుల సమక్షంలో వెల్లడించడం ద్వారా రానున్న రోజుల్లో తీసుకురావాల్సిన మార్పులు… చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.

మంత్రులు.. అధికారులతో సీఎం చంద్రబాబు పలు అంశాల పైన ఉన్నత స్థాయి సమీక్ష. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే… దిశా నిర్ణయం చేసారు. అదే సమయంలో వివిధ అంశాల్లో 175 నియోజక’వర్గాలకు ర్యాంకులు ప్రకటించారు. వివిధ ఇంటికేట‌ర్లను దృష్టిలో పెట్టుకొని ర్యాంకులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం… ఏ నియోజ‌క‌వ‌ర్గం ఏ స్థానంలో ఉందో స్పష్టత ఇచ్చింది.

సూచికల పనితీరు వివరాల ఆధారంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏపీ ప్రభుత్వం గ్రేడింగ్‌లను ప్రకటించింది.

మొత్తం 175 ఎమ్మెల్యే నియోజ‌కవర్‌గాల్లో ఏ ప్లస్‌లో 21న నియోజక వ‌ర్గాలు ఉన్నాయి. కాగా, ఏ లో 153.. బి లో ఒక నియోజక వ‌ర్గం ఉంది. కాగా, 90 శాతం మార్కుల సాధించి ఏ ప్ల‌స్ ద‌క్కించుకున్న 13 నియోజ‌క‌వ‌ర్గాలు చూపించారు. 93 శాతం మార్కులు సాధించిన రాష్ట్రంలోనే నెంబ‌ర్ ఒన్ స్థానంలో ఎన్టీఆర్ స్థానంలో సుజ‌నా చౌద‌రి ప్రాబల్యం వ‌హిస్తున్న‌ విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గం సాధించింది.

అధికారులకు దిశా నిర్ణయం

కాగా, 92 మార్కులు సాధించి రెండో ర్యాంకు విశాఖ పట్నంలోని గాజువాక. ఇక.. 3వ ర్యాం ర్యాంకు కాకినాడ న‌గ‌ర నియోజ‌క వ‌ర్గం కు దక్కింది. 4వ ర్యాంకు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క వర్గం కు వచ్చినట్లు ప్రకటన. ఇదే సమయంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాల పైన అప్రమత్తం చేసారు. వేసవి కాలం నేపథ్యంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి నుంచే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడంతోపాటు… పశువుల దాణాకూ రాకూడదని సీఎం చెప్పారు.

మరోవైపు ప్రజాసమస్యలు-పాలన తీరును తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో నిధులు కేటాయించాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే దానిని ప్రత్యక్షంగా చూడాలన్నారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా… క్షేత్ర స్థాయిలో పాలసీలు సమర్ధవంతంగా అమలు కానప్పుడు ఆశించిన ఫలితాలు రావని సీఎం అభిప్రాయపడ్డారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular