seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 2:42 pm Digital Edition : SEEMA KIRANAM

శోభాయాత్ర మార్గాల్లో ఎస్పీ పాదయాత్ర

క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

 

 

రాంబొట్ల దేవాలయం నుంచి అమ్మవారి శాల వరకు కాలినడకన పర్యటించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్

 

 

పోలీసు అధికారులకు పలు సూచనలు.. 

 

 

అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

 

 

ఇతర శాఖలతో సమన్వయంతో నిమజ్జనోత్సవాన్ని సజావుగా నిర్వహించాలని దిశానిర్దేశం

 

 

 

కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 21, ( సీమకిరణం న్యూస్):

 

 

మంగళవారం కర్నూలు నగరంలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనోత్సవం సందర్భంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం రాంబొట్ల దేవాలయంలో కొలువైన గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాంబొట్ల దేవాలయం నుంచి అమ్మవారి శాల వరకు కాలినడకన పర్యటించి గణేష్ విగ్రహాల ఊరేగింపు, శోభాయాత్ర జరిగే మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు మధుసూదన్‌రావు, కేశవరెడ్డి, మారుతి శంకర్, విక్రమ సింహ, శ్రీధర్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.