లో వోల్టేజీ సమస్యని పరిష్కరించండి మహాప్రభో !!!!
వేలాడుతున్న విద్యుత్ తీగలు... ఇబ్బందుల్లో 7వ వార్డు ప్రజలు వెల్దుర్తి, ఫిబ్రవరి 27, (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి పట్టణంలోని 7వ వార్డులో తక్కువ వోల్టేజ్ సమస్యతో పాటు ఇళ్ల మిద్దెలకు ఆనుకుని ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. తక్కువ వోల్టేజ్‌తో ఇబ్బందులు వార్డులో నిరంతరం తక్కువ వోల్టేజ్ సరఫరా అవుతుండటంతో ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, మిక్సీలు, ఫ్యాన్లు...