*💥”స్పందనలో స్పందన కరువా?”*
*✍️పీజీఆర్ఎస్‌లో వేల ఫిర్యాదులు... కానీ ప్రజలకు దక్కుతున్నది నిజమైన పరిష్కారమా?* అమరావతి, జూలై 18, "(సీమకిరణం న్యూస్" ప్రత్యేక ప్రతినిధి,) : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS – స్పందన) వ్యవస్థపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు న్యాయం అందించేందుకు రూపొందించిన ఈ వ్యవస్థ, ప్రస్తుతం కేవలం గణాంకాలకే పరిమితమవుతోందా అనే సందేహాలు బాధితులు, సామాజిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, పోలీస్,...