seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 1:18 am Digital Edition : SEEMA KIRANAM

హోం మంత్రి అనిత ఇలాకాలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్! | పాయకరావుపేట హోంమంత్రి అనిత నియోజకవర్గంలో మరో కొత్త విమానాశ్రయం, ఏపీ ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి సిద్ధమైంది

ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఏవియేషన్ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండటంతో ఏపీ రాష్ట్రానికి రెక్కలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య కేంద్రాలలో కొత్త విమానాశ్రయాలకు కీలక అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9 కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించగా, మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికే కొన్నింటికి భూసేకరణ టెండర్లు. ఇక ఈ ప్రణాళికలో భాగంగా కాకినాడ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు. మొదట కాకినాడ నిర్మాణంతో పాటు అన్నవరం తుని మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రభుత్వం భావించింది, రైతులు వ్యతిరేకించడంతో సాంకేతిక సమస్యల వల్ల ఆ ప్లాన్‌లో మార్పు వచ్చింది.

హోంమంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది

అక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మాణం డీపీఆర్

ఆ తర్వాత అనకాపల్లి ఏర్పాటు చేసిన పాయకరావుపేట నక్కపల్లి మధ్యలో గోపాలపట్నం వద్ద ఎయిర్‌పోర్టును నిర్మించాలని భావించినా, ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. అయితే ఇటీవల మళ్లీ ఎయిర్‌పోర్ట్స్‌లో జరిగిన చర్చలో తుని అన్నవరం మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కావలసిన డిపిఆర్ సిద్ధమవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

కాకినాడ సమీపంలో ఎయిర్ పోర్ట్ అవసరం ఇందుకే

కాకినాడ తో పాటు ఉప్పాడ అనకాపల్లిలోని నక్కపల్లి లో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్న కారణంగా ఎయిర్‌పోర్ట్ అవసరం లేదని, ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. బల్క్ డ్రగ్, ఆర్సెలర్ మిట్టల్, ఎన్టీపీసీ పరిశ్రమలు ఇక్కడికి రావడంతో పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే కాకినాడ విమానాశ్రయం ఏర్పాటు చేయడం అవసరమని భావించి దీని పైన దృష్టి సారిస్తున్నారు.

పాయకరావుపేట సమీపంలోనే ఎయిర్‌పోర్ట్ వస్తుందా?

తునికి వంద దూరంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ లో ఉంది. గతంలో ఈ భూములు అనుకూలం పోవడంతో తుని ప్రతిపాదన రద్దు. ఇప్పుడు పాయకరావుపేట సమీపంలో నిర్మాణం పైన తిరిగి దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అదే గనుక జరిగితే మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటవుతుంది.

హోం మంత్రి ఇలాకాలో ఎయిర్ పోర్ట్.. సందిగ్ధానికి త్వరలోనే తెర

ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ ను ప్రభుత్వం హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర ఏర్పాటు చేస్తారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఈ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు విశాఖపట్నం రాజమహేంద్రవరం కు మధ్యలో ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం ఆయన పాయకరావుపేట దగ్గర ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు జరుగుతుందా? లేదా అన్న సందిగ్ధానికి త్వరలోనే తెరపడే అవకాశం ఉంది.

ఆంగ్ల సారాంశం

ఏపీ ప్రభుత్వం తొమ్మిది కొత్త విమానాశ్రయాలను ప్లాన్ చేస్తోంది. ఈ చొరవలో భాగంగా, కాకినాడ జిల్లాలో కొత్త విమానాశ్రయాన్ని ప్రతిపాదించడం గందరగోళంలో ఉంది, అయితే ఇటీవల అధికారులు ప్రాంతీయ అనుసంధానం మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి తుని మరియు అన్నవరం మధ్య నిర్మాణానికి DPR ను సిద్ధం చేస్తున్నారు.

Source link