seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 10:23 am Digital Edition : SEEMA KIRANAM

హైదరాబాద్ TO అరుణాచలం.. అతి తక్కువ ధరకే IRCTC బెస్ట్ ప్యాకేజీ..! | జ్యోతిర్లింగ దర్శనంతో దివ్యదక్షిణ్యయాత్ర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు యాత్ర!

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మహా శివరాత్రిని పురస్కరించుకుని అనేకమంది భక్తులు జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తారు. అలాంటి వారికోసం IRCTC బెస్ట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ టూర్‌లో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

దివ్య దక్షిణ యాత్రలో భాగంగా సికింద్రాబాద్ నుంచి రైలు ప్రారంభం. ఈ రైలు టికెట్ వివరాలు చూస్తే పెద్దలకు రూ.14,700 ఉంది. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్ ధరను అధికారులు నిర్ణయించారు. ఇక కంఫర్ట్ క్లాస్ అయితే పెద్దలకు రూ. 28,700, చిన్నారులకు రూ.27,400 నిర్ణయించారు.

ఈ టూర్‌లో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచ్చి, తంజావూరు.. తదితర ప్రముఖ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఇక ఈ పర్యటన మొత్తం 7 రోజులు, 8 రాత్రులుగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన రైలు.. సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్టేషన్లలో ఏదైనా స్టేషన్ నుంచి మీరు రైలు ఎక్కే అవకాశం ఉంది.

ఇక ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు అరుణాచలం చేరుకుంటుంది. అక్కడి నుంచి భక్తుల వసతి గృహానికి వెళ్తారు. అనంతరం అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మూడో రోజు రామేశ్వరం ఆలయ దర్శనం ఉంటుంది. అలా రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది. నాలుగోరోజు రామేశ్వరం నుంచి మధురై వెళ్తారు. ఐదో రోజు రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్ సెట్ పాయింట్ ను సందర్శిస్తారు. ఇక కన్యాకుమారిలోనే డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

జ్యోతిర్లింగ దర్శనంతో కూడిన దివ్యదక్షిణ్యయాత్ర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు యాత్ర

ఇక ఆరో రోజు త్రివేంద్రం బయలుదేరుతారు. అక్కడ శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్‌ను సందర్శిస్తారు. ఏడోరోజు బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అలా చివరగా సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. తంజావూరు రైల్వే స్టేషన్‌లో రాత్రి 8 గంటలకు ట్రైన్ ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాణంలోనే ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ కు రాత్రి 9 గంటలకు రైలు చేరుకుంటుంది. దాంతో ఈ టూర్ ముగుస్తుంది. ఇక టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Source link