తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->నెయ్యిలో అనేక పోషక విలువలు ఉంటాయి. చిన్న పిల్లలకు నెయ్యితో చేసిన పదార్థాలను ఎక్కువగా పెడతారు. ఇక ఇతర వంటల్లోనూ నెయ్యి జోడిస్తే ఆ రుచి వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే నగరంలో స్వచ్ఛమైన నెయ్యి దొరకడం చాలా కష్టం. కానీ చేసేదేంలేక నగర ప్రజలు నగరంలోనే నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. అయితే అలాంటి వారికి ఇప్పుడో షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి దందా పెరిగిపోతుంది. తాజాగా రూ. 18 లక్షలకు పైగా విలువైన 460 కిలోల కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నగర వాసులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. ప్రైడ్ డెయిరీ అనే సంస్థ కల్తీ నెయ్యి తయారు చేస్తోందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు, మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా బంజారాహిల్స్‌లోని ప్రైడ్ డెయిరీ సంస్థపై దాడులు జరిగాయి. దాదాపు 460 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి విలువ సుమారు రూ.18 లక్షలకుపైగానే ఉన్నట్లు సమాచారం.

ఈ కల్తీ నెయ్యిని వివిధ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసే వస్తువులు. ఇక ఈ నెయ్యిని వనస్పతి నూనె, పామాయిల్, ఇతర రసాయనాలతో తయారు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కల్తీ నెయ్యి ఘటనలో నిందితుడు జునైద్ హుసెన్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దందాపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఈ మేరకు నగరవాసులకు పోలీసులు తగు సూచనలు చేశారు. పదార్థాలు కొనుగోలు చేసేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.