తెలంగాణ
ఓయ్-జక్కీ మహేష్
హైదరాబాద్ బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది. బిర్యానీ పార్టీ అంటే చాలు.. ఎంతో ఇష్టంగా వెళ్తూ ఉంటారు. అలాంటి బిర్యానీ రుచి వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. అలాంటి బిర్యానీని తయారుచేసే భాగ్యనగరంలో ప్రముఖ హోటళ్లకు ఒక్కసారిగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటల్ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు దొరకక పోవడంతో చేసేదేమీ లేక పాత కాలపు పద్ధతిలో కట్టెల పొయ్యిలపై వంటలు కానిచ్చేస్తున్నారు.
ప్రముఖ హోటల్‌లో కట్టెల పొయ్యి సెటప్
హైదరాబాద్ నగరంలో అత్యంత పాపులర్ అయిన షా గౌస్ హోటల్‌లో గత రెండు రోజులుగా ఓ వింత దృశ్యం ఏర్పడింది. ఎప్పుడూ గ్యాస్ పొయ్యిలపై వంటలు చేసే హోటల్‌లో కట్టెలు పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. గ్యాస్ కొరతతో వినియోగదారులకు బిర్యానీని అందించడం కోసం హోటల్ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కేవలం షాగౌస్ హోటల్ మాత్రమే కాదు.. పాతబస్తీతో పాటు హైటెక్ సిటీ వైపు ఉన్న పెద్ద హోటళ్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.

వంట ఆలస్యం.. వెయిటింగ్ తప్పదు!
సాధారణం గ్యాస్ పొయ్యిలపై వంట వేగంగా పూర్తవుతుంది. కానీ కట్టెల పొయ్యి కావడంతో వంట తయారీకి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో హోటళ్లకు వచ్చే కస్టమర్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. బిర్యానీ కోసం వచ్చిన కస్టమర్లు.. కట్టెల పొయ్యి మీద వండిన బిర్యానీ రుచి ఎలా ఉంటుందోనని చర్చించడం వైరల్ అయింది.
హైదరాబాద్ లో హోటల్స్ కు గ్యాస్ కొరత
ఎల్పీజీ కొరత కారణంగా కట్టెల పొయ్యిలపై బిర్యానీ వండుతున్న హోటల్స్
ప్రముఖ షాగౌస్ హోటల్ లో రెండు రోజులుగా కట్టెల పొయ్యిలపైనే వంట pic.twitter.com/eE4yfQ6dSV
— ఛోటాన్యూస్ యాప్ (@ChotaNewsApp) మార్చి 11, 2026
ఎందుకీ గ్యాస్ కొరత?
కట్టెల పొయ్యిల మీద వండడానికి ప్రధాన కారణం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయాన్ని కలగడమే. హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీల నుంచి సకాలంలో సిలిండర్లు అందడం లేదు. ఫంక్షన్లు, వివాహాల సీజన్ కావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి గ్యాస్ కొరత ఏర్పడింది.
నెట్టింట ఫోటోలు, వీడియోలు వైరల్
హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్ల వెనుకభాగంలో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నవాబుల నగరంలో మళ్ళీ కట్టెల పొయ్యి కాలం వచ్చిందా?” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిర్యానీకి కేరాఫ్ అడ్రస్ అయిన హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితి రావడం.

