తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->భారతదేశంలో రైల్వే నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, అమృత్ భారత్, వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశ రైల్వే ప్రారంభాన్ని చాటి చెబుతున్నాయి. అత్యాధునిక రైళ్లను ప్రవేశ పెడుతూ గత పది సంవత్సరాలుగా భూమిని మోదీ రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులను ప్రభుత్వం అందించింది. తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం అధునాతన సాంకేతికతతో కూడిన అనేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లతో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
ఈ రైల్వే శాఖ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య ఆలయం నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి మధ్య ఈ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కామాఖ్య చర్లపల్లి అమృత్ భారత్ రైలు కేవలం స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లతో నడుస్తుంది. సామాన్యులకు అందుబాటు ధరల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడం ఈ రైలు యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

చర్లపల్లి రైల్వేస్టేషన్ తో పాటు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ ల రద్దీ
ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ రైలు హైదరాబాద్ శివారులో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్‌తో పాటు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి స్టేషన్ల రద్దీని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ కొత్త రైలు చర్లపల్లి నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది. ఇది హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తున్న నాలుగవ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా చెప్పుకోవచ్చు.
హైదరాబాద్ టికెట్ ధరలు ఇలా
హైదరాబాద్ నుంచి ఎవరైనా కామాఖ్య ఆలయానికి వెళ్లాలనుకుంటే ఈ రైలులో ప్రయాణం చేస్తే అతి తక్కువ చార్జీలు ఉంటాయి. కేవలం 460 రూపాయలతో జనరల్ టికెట్ ఉండగా స్లీపర్ క్లాస్ సాధారణంగా ఎనిమిది వందల రూపాయల నుండి 900 రూపాయల వరకు దూరాన్ని బట్టి మారుతుంది. చర్లపల్లి నుంచి కామాఖ్య ఆలయానికి పూర్తి ప్రయాణం 2470 నుండి .ఈ పూర్తి ప్రయాణానికి దాదాపు 50 గంటల సమయం పడుతుంది.
కొత్త రైల్లో కామాఖ్యకు రైలు తేదీ సమయం ఇదే
కొత్త కామాఖ్య-చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడు అందుబాటులో ఉంది రైల్వే శాఖ. చర్లపల్లి-కామాఖ్య సర్వీస్, రైలు నంబర్ 15673, మార్చి 18, 2026 బుధవారం నాడు చర్లపల్లి నుండి రాత్రి 9:40 గంటలకు బయలుదేరుతుంది. మార్చి 20వ తేదీ శుక్రవారం రాత్రి 10:00 గంటలకు కామాఖ్యకు చేరుకుంటారు.
అమృత్ భారత్ లో కామాఖ్య ఆలయం చూసేయండి
రైలు నెం. 15674 కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, మార్చి 22, ఆదివారం ప్రారంభమై, మంగళవారం మధ్యాహ్నం 2:40 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. మరి ఎందుకు కలిసిన అతి తక్కువ ఖర్చుతో హైదరాబాద్ నుంచి కామాఖ్య ఆలయానికి వెళ్లాలనుకునేవారు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ను ఎక్కేయండి.
ఆంగ్ల సారాంశం
చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు, తెలంగాణను అస్సాంతో కలుపుతుంది. స్టేషన్‌లు మరియు ఛార్జీలు, రైలు షెడ్యూల్‌లు మరియు ప్రయాణ వివరాలను తనిఖీ చేయండి.