Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! రేపు మాత్రమే..! | ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కాచిగూడ-తిరుపతి...

హైదరాబాద్-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! రేపు మాత్రమే..! | ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కాచిగూడ-తిరుపతి వన్‌వే ప్రత్యేక రైలును రేపు నడపనున్న SCR

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సయ్యద్ అహ్మద్

హైదరాబాద్ (కాచిగూడ)నుంచి తిరుపతి (తిరుపతి) వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రేపు ఓ ప్రత్యేక రైలు నడుపుతోంది. ప్రయాణికుల నేపథ్యంలో ఇలా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే ఈ రైలు బయల్దేరే సమయాలు, హాల్ట్ లు, ఇతర వివరాలను కూడా ఎక్స్ లో ట్వీట్ చేసింది. కాబట్టి కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులు వీటిని గమనించాల్సి ఉంటుంది.

కాచిగూడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నంబర్ 07511 ను రేపు (ఫిబ్రవరి 12) నడపాలని అధికారులు నిర్ణయించారు. ఇది కేవలం వన్ వే ట్రైన్ మాత్రమే. కాచిగూడలో ఈ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 10.40కి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు (ఫిబ్రవరి 13)న ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే ఈ రైలుకు ఉందా నగర్, షాద్ నగర్, జడ్చర్ల మహబూబ్ నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. ఇందులో ధర్డ్ ఏసీ, చైర్ కార్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.

అదనపు రద్దీని క్లియర్ చేయడానికి SCR రేపు కాచిగూడ-తిరుపతి వన్-వే ప్రత్యేక రైలును నడపనుంది

కాబట్టి రేపు కాచిగూడ నుంచి తిరుపతికి ప్లాన్ చేసుకునే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మార్గంలో ఇప్పటికే పెరుగుతున్న రద్దీతో ప్రయాణికులకు టికెట్లు అందడం లేదు. దీనితో ఈ ప్రత్యేక రైలును కేవలం ఒకవైపుకే నడుపుతున్నారు. తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో ప్రస్తుతం బాగానే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దీనితోపాటు ప్రత్యేక రైళ్లను కూడా వివిధ మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular