తెలంగాణ
ఓయ్-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->ఉరుకులు పరుగుల జీవితం.. కాంక్రీట్ జంగల్ నుంచి కాసేపైనా బయటపడాలని చాలామంది కోరుకుంటున్నారు. బిజీ లైఫ్ ను పక్కనపెట్టి వీకెండ్‌టూరిజం వైపు మళ్లుతున్నారు టెకీలు.. పచ్చని ప్రకృతి ప్రదేశాలను తనివితీరా ఆస్వాదించేందుకు తహతహలాడుతున్నారు. ఇక ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు వికారాబాద్‌లో అనంతగిరి కొండలు. ఈ పచ్చని కొండల ప్రాంతంలో.. కర్ణాటకలో ‘జంగిల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్’ రేంజ్‌లో ఎకో టూరిజం బ్రాండ్‌గా తెలంగాణ అభివృద్ధి సంస్థ ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్’ పేరుతో ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అనంతగిరి హిల్స్ లో ది ‘బ్రీజ్’ ను తీర్చి దిద్దుతోంది.
ది బ్రీజ్ ప్రోగ్రాంలో భాగంగా .. అనంతగిరి అడవుల్లో జంగిల్ కాటేజీలను నిర్మించారు. ట్రెక్కింగ్, బర్డ్స్ వాక్, నైట్ క్యాంప్స్, సఫారీ, బుష్ బ్రేక్ ఫాస్ట్ వంటి వినూత్నమైన కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యటకులను మధ్యాహ్నం 1 గంటకు బ్రీజ్‌లో మేనేజర్/ నేచురలిస్ట్ బృందం రిసీవ్ చేసుకుంటుంది. అలాగే మధ్యాహ్నం 10 రకాల వంటలతో భోజనం అందిస్తారు.
ఇక కాసేపు విశ్రాంతి తర్వాత సాయంత్రం 4 గంటలకు ట్రెక్కింగ్, బర్డ్‌వ్యూ చేస్తూ సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తారు. అలా నాలుగు గంటల తర్వాత సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు రిసార్ట్ లో స్నాక్స్ ఇస్తారు. ఇక రాత్రి 7.30 గంటలకు క్యాప్ ఫైర్ వేసి వైల్డ్ లైఫ్ గురించి అనేక అంశాలను టూరిస్టులకు వివరించారు. అలాగే రాత్రి 8 గంటల తర్వాత నాన్ వెజ్ డిన్నర్ అందిస్తారు. ఇక రాత్రికి టెంట్ లోనే బస చేస్తారు పర్యటకులు.

మరుసటి రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు సఫారీ ప్రారంభం అవుతుంది. ఈ సఫారీ దాదాపు 10 కి. మీ ఉంటుంది. అడవిలో తిరుగుతారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల సమయంలో బుష్ బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. ఇక ఉదయం 11 గంటలకు చెక్ అవుట్ ఉంటుంది. ఈ ప్యాకేజీ కావాలనుకునే పర్యాటకులు deccanwoodsandtrails.com వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 9493549399, 9885298980 నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.