seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 3:58 pm Digital Edition : SEEMA KIRANAM

హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి | నాంపల్లి రైల్వే స్టేషన్ కొత్త రూపం..హైదరాబాద్‌కు మరో మైలురాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ తర్వాత హైదరాబాద్ కు మరో తలమానికంగా నిలవబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… 350కోట్ల రూపాయలతో బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా పనులు జరుగుతున్నాయని, 16 లిఫ్టులు, 8 ఎస్కలేటర్లు, అత్యాధునిక పార్కింగ్, అధునాతన రెస్టారెంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల కోట్ల రూపాయలతో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ

2027 చివరి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 47 వేల కోట్ల రూపాయలతో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ జరుగుతోంది. రాష్ట్రంలో 384 మేర కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేసింది. వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ ద్వారా స్థానిక వస్తువులకు ప్రోత్సాహం అందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణ రైల్వే రంగం సరికొత్త పుంతలు తొక్కుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

నాంపల్లి రైల్వే స్టేషన్ కొత్త రూపం హైదరాబాద్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరో మైలురాయి

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా నాంపల్లి స్టేషన్ ఆధునీకరణ

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ప్రముఖ రైల్వే కేంద్రాలలో నాంపల్లి రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా ఈ స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్టేషన్‌ను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా నాంపల్లి రైల్వే స్టేషన్

కొత్తగా విశాలమైన ప్రవేశద్వారాలు, ఆధునిక వెయిటింగ్ హాల్స్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.అలాగే స్టేషన్ పరిసరాలను శుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రమాణాలకు దగ్గరగా ఉండేలా మారనుంది.

రైల్వే స్టేషన్ ఆధునీకరణతో రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు

ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌లో ఆధునీకరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందజేస్తున్నారు. ఇక ఇదే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు.

ఆంగ్ల సారాంశం

నాంపల్లి రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు మరియు మెరుగైన కనెక్టివిటీతో ఆధునీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Source link