తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->తెలంగాణలో సారథ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపూర్వ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ. తిరుగులేని మెజారిటీని అందుకుంది. భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ప్రభావం ఏ మాత్రం కనిపించని ఎన్నికలు ఇవి. ఈ రెండు పార్టీలు అంచనాలకు అనుగుణంగా సత్తా చాటలేకపోయాయి. మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది.
ఈ ఎన్నికల్లో పార్టీ ఘన సాధించడంపై లోక్‌సభ సభ్యురాలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. ఫలితాలు వెలువడే రోజే ఆయన దేశ రాజధానిలో ప్రియాంక గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చర్చకు వచ్చాయి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని అభినందించారు. ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల ఆమోదం కోసం జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిళ్లను తీసుకొస్తామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయాన్ని అందజేశారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని సాధించినందుకు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారాయన. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని అన్నారు.
పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద – మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని.
ఈ విజయం తమ ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని, ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
ఆంగ్ల సారాంశం
మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రియాంక గాంధీ వాద్రా అభినందించారు