seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 3:03 pm Digital Edition : SEEMA KIRANAM

హెరాల్డ్స్ స్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

హెరాల్డ్స్ స్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

 

హెరాల్డ్స్ స్కూల్‌లో సందడిగా టీచర్స్ డే వేడుకలు

 

 

గురువులకు సన్మానం… విద్యార్థుల సందడితో కళకళలాడిన పాఠశాల!

 

విద్యార్థుల్లో ఆనందోత్సాహం!

 

 

కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 05, (సీమకిరణం న్యూస్):

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగర శివారులోని ఇడ్లీ హోటల్ సమీపంలో ఉన్న హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ పౌలూస్ పేర్కొన్నారు. గురువు కేవలం విద్యను బోధించే వ్యక్తి మాత్రమే కాకుండా, విద్యార్థులకు సన్మార్గం చూపే మార్గదర్శి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ పౌలూస్ తో పాటు ఫాదర్ ఏసుబాబు, స్కూల్ ప్రిన్సిపాల్ మరియట్ట, ఉపాధ్యాయులు అనీ, నవీన, రేష్మా, విజయ, మరియళ్ళ, మాదోని, సింధ్య, భాగ్యలక్ష్మి, సులేఖ, బ్రదర్ రాహుల్తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.