ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->ఇరాన్ యుద్దం కారణంగా ఎల్పీజీ (LPG సంక్షోభం) కొరత కారణంగా వివిధ రాష్ట్రాల్లో హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదే కావాలి ఏపీలోనూ హోటల్స్ పై ఎల్పీజీ కొరత ప్రభావం పడింది. రోజురోజుకీ గ్యాస్ కొరత తీవ్రమవుతుందని ఇవాళ విజయవాడలో సమావేశమైన ఏపీ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్బీజీ కొరతను అంచనా వేశాక ఈ నిర్ణయాలు ప్రకటించారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్…. స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమైంది. గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల పట్ల హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రేపాటి నుంచే గ్యాస్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ నిర్ణయించింది.

గ్యాస్ పొదుపు చర్యల్లో భాగంగా స్టార్ హోటళ్లలో జుమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఆర్డర్‌లను త్వరలో నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్యాస్ ఆదా కోసం ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి, ‘వీక్లీ హాలిడే’ ప్రకటించనున్నారు. దీనివల్ల కొంతవరకు గ్యాస్ ఆదా అవుతుందని. అలాగే కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి వచ్చింది. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా సమయం కుదించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది, డొమెస్టిక్ గ్యాస్ మాదిరిగానే కమర్షియల్ గ్యాస్‌ను కూడా అందించడానికి హోటల్స్ కోరాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఆతిథ్య రంగంపై ఆధారపడిన వేల మంది కార్మికులు వీధిన పడకుండా చూడాలని, హాస్పిటాలిటీ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.