seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 2:38 pm Digital Edition : SEEMA KIRANAM

స్వామి–అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

స్వామి–అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ

 

పత్తికొండ, ఫిబ్రవరి 07, (సీమకిరణం న్యూస్):

పత్తికొండలో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి తిరుణాల సందర్భంగా తేరు బజార్‌లోని ఆలయంలో స్వామి–అమ్మవార్లకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథం వద్ద కొబ్బరికాయ కొట్టి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి, ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, వైస్ సర్పంచ్, ఎంపీపీ, పత్తికొండ, తుగ్గలి, మద్దికేర మండలాల కన్వీనర్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు,రాష్ట్ర కమిటీ నాయకులు, మైనారిటీ నాయకులు, పత్తికొండ పట్టణం వార్డు మెంబర్లు, అనుబంధ సంఘాల తాలుకా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.