seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 3:22 pm Digital Edition : SEEMA KIRANAM

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు

కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 14 (సీమకిరణం న్యూస్):

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగుతూ దేశ సమగ్రాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఎమ్మార్వో ఆంజనేయులు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.