seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 4:37 pm Digital Edition : SEEMA KIRANAM

స్కిల్ యూనివర్సిటీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: కవిత | kavitha Slams False Enrollment numbers Young India Skill University Strong Attack SkillUniversity

తెలంగాణ

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యూనివర్సిటీలో నవంబర్, 2024 నుంచి కేవలం 920 మంది విద్యార్థులు మాత్రమే శిక్షణ కోసం పేరు నమోదు చేసుకున్నారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తోందని పేర్కొంది.

మార్చి 20, 2026 నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య 68,680గా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కల్ని ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో తప్పుడు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ వెబ్ సైట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసినట్లు స్పష్టం అవుతోంది. మార్చి 21, 2026 నాటికి వెబ్‌సైట్‌లో 1000 మంది విద్యార్థులు అలాగే 68,935 మంది విద్యార్థులు లెర్నర్‌లను సందర్శించినట్లు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YISU)ప్రచురిస్తోంది.

ఇదే విషయంపై తెలంగాణ జాగృతి నుంచి స్పష్టమైన సందేశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి విశ్వాసం, సమగ్రతతో పనిచేయాలని వివరించింది. వెబ్‌సైట్‌లలో తప్పుడు లెక్కలతో కోట్ల మంది ప్రజలు తప్పుదారి పట్టించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇలాంటి విషయాల్లో తెలంగాణ జాగృతి ప్రజల పోరాటం చేస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్ట్రాంగ్ ఎటాక్ స్కిల్ యూనివర్శిటీపై తప్పుడు నమోదు సంఖ్యలపై కవిత నిందలు వేశారు.

అలాగే రాష్ట్రంలో కేవలం 13వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని కవిత ధ్వజమెత్తారు. తాము ప్రజా బడ్జెట్ లో లేవనెత్తిన కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో పెట్టలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మైనార్టీలు, దివ్యాంగుల సంక్షేమానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. బడ్జెట్ లో కేటాయింపులు చేయకున్నా.. అవకాశం దక్కని రంగాలకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ప్రాధాన్యత ఇవ్వచ్చని డిమాండ్ చేశారు.

Source link