తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బేగంపేటలోని ప్రజావాణిలో నేడు మెరుపు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత నిర్వహించారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులతో పాటు ఈ ఆందోళనలో ఉన్నారు.
ప్రజా భవన్ ముందు ఆ హామీల కోసం కవిత ధర్నా
సోనియా గాంధీ సోనా దీజియే , ప్రియాంక గాంధీ స్కూటీ దీజియే, మహిళలకు నెలకు రూ. 2,500ఇవ్వండి అంటూ ఆందోళన చేశారు. అలాగే పింఛన్‌లను పెంచాలని నినాదాలు చేశారు. అనంతరం, కవిత తన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యకు సమర్పించారు.ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజావాణికి వచ్చిన తమ విద్యార్థులు, మహిళలను పోలీసులు తప్పుగా అరెస్ట్ చేసి, దురుసుగా ప్రవర్తించారని కవిత తీవ్రంగా ఖండించారు.

ఇలా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం: కవిత
రోజూ ప్రజావాణిలో ఉంటానన్న సీఎం మాట నిలబెట్టుకోలేదని, ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని తెలిపారు. తమ వారిని అరెస్టు చేస్తున్నారంటేనే వచ్చానని ఆమె అన్నారు.
వినతి పత్రాలు ఇచ్చేందుకు ఆధార్ కార్డులు, దరఖాస్తు ఫామ్‌లతో శాంతియుతంగా వచ్చామని, పోలీసులతో నియంత్రణ చర్యలు చేపడితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కవిత హెచ్చరిక.
పూర్తిస్థాయి బడ్జెట్ లో హామీలు నెరవేర్చవలసిందే
రానున్న ఫిబ్రవరి 26న ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో మహిళలకు హామీలైన రూ.2,500, స్కూటీలు, తులం బంగారం కోసం నిధులు కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే, రూ.2,000 ఉన్న పింఛన్‌ను రూ.4,000లకు పెంచాలని కూడా ఆమె స్పష్టం చేశారు.బడ్జెట్‌లో ఈ హామీలను నెరవేర్చుకుంటే సెక్రటేరియట్, అసెంబ్లీలను ముట్టడిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కవిత తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు మున్సిపల్ ఎన్నికల సాక్ష్యం
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యన్న ఆమె, బీఆర్ఎస్ దయతోనే బీజేపీకి ఒకటి, రెండు చైర్మన్ సీట్లు వచ్చినట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు మున్సిపల్ ఎన్నికల్లో లభించిన సహకారమే తొలిమెట్టు అని కవిత పోటీ చేశారు. రైతులకు బోనస్ ఇవ్వడం గొప్ప ఘనత కాదని, అది ప్రభుత్వం హామీనే తప్ప కొత్తది కాదని ఆమె ఎత్తిచూపారు.
మహిళల తరపున మాట్లాడేందుకు నేనున్నా: కవిత
మహిళల హామీలను విస్మరించవద్దని, వారు మాట్లాడే వారెవరూ లేరనుకోవద్దని కవిత హెచ్చరించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వం కనీసం వారికిస్తామన్న రూ.2.500 అయినా వెంటనే అందజేయాలని కవిత డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం అవుతోందని ఆమె స్పష్టం చేసింది.
ఆంగ్ల సారాంశం
మహిళలకు 2500 రూపాయలు, ఒక తులాల బంగారం, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత ప్రజాభవన్ ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.