seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:38 pm Digital Edition : SEEMA KIRANAM

సేవా సంకల్ప్ అభియాన్‌తో అందరికీ ఆరోగ్యం

సేవా సంకల్ప్ అభియాన్‌తో అందరికీ ఆరోగ్యం

 

 

వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి 

 

 

 

వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం

 

 

కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 09, ఎస్.కె. నజీర్ ఎడిటర్, (సీమకిరణం న్యూస్):

 

సేవా సంకల్ప్ అభియాన్ లక్ష్యం ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమేనని వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు లక్ష్మిరెడ్డితో కలిసి ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నెల రోజుల ప్రత్యేక ప్రజాసేవా కార్యక్రమంలో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్య సేవల ప్రాధాన్యతను వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగ అభివృద్ధికి కృషి చేస్తోందని, రోగులకు అవసరమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని వక్తలు తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్, బీజేపీ నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు.