seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 2:19 am Digital Edition : SEEMA KIRANAM

సుప్రీంకోర్టు వద్దన్నందుకు ఇంకో 10 శాతం ఎక్స్ ట్రా టారిఫ్ పెంచిన ట్రంప్ | డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై కొత్త గ్లోబల్ 10 శాతం సుంకాన్ని విధించారు మరియు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు

అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయాలను తీసుకున్నారు. ఏకంగా న్యాయవ్యవస్థతో పూర్తి స్థాయిలో పోరాటానికి దిగారు. గతంలో ఆయన విధించిన టారిఫ్ ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అక్రమంగా తేల్చిన కొన్ని గంటల్లోనే ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశారు. కొత్తగా 10 శాతం అదనపు టారిఫ్ ను విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైనా వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో అప్పటికప్పుడు సంతకం కూడా చేసి పడేశారు.

దాదాపుగా తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయనీ తేల్చి చెప్పారు. కొత్తగా ప్రకటించిన 10 శాతం ఈ అదనపు టారిఫ్ అన్ని దేశాలకూ వర్తిస్తుంది. భారత్ సహా ఏ ఒక్క దేశం కూడా దీని నుంచి మినహాయింపు కాదు. దీన్ని గ్లోబల్ టారిఫ్ గా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలోని అన్ని దేశాల దిగుమతుల పైనా దీన్ని వర్తింపజేశారు. ఈ పని ఆయన స్వయంగా కలిగి. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై కొత్త గ్లోబల్ 10 శాతం సుంకాన్ని విధించారు మరియు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు

అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధించినందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశానని, ఇందుకు గర్వపడుతున్నానని ట్రంప్ ప్రతిపాదన. ఈ టారిఫ్ దాదాపు తక్షణమే అమలులోకి వస్తుందని అంటున్నారు. భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రస్తుతానికి ప్రభావితం చేయబోదని పేర్కొన్నారు. అది న్యాయమైన ఒప్పందంగా అభివర్ణించారు. తాము భారత్ కు టారిఫ్ కట్టట్లేదని, అందుకే ఫ్లిప్ చేశామని చెప్పారు.

ఈ 10 శాతం అదనపు టారిఫ్ నుండి భారత్ కు మినహాయింపు ఇస్తూ కొత్తగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటి వరకూ టారిఫ్ భారం భారత్ పైనా పడుతుందని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. 10 శాతం గ్లోబల్ టారిఫ్ భారత్‌కు కూడా వర్తిస్తుందని, మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదలయ్యే వరకు ఇది అమలులో ఉందని స్పష్టం చేశారు. అన్ని అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా ప్రస్తుత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

టారిఫ్ పై సుప్రీం ఆదేశాలు వెలువడిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ సమావేశంలో మాట్లాడారు. తీర్పును తప్పుపట్టారు. భయంకరమైనది, లోపభూయిష్టమైనదిగా అభివర్ణించారు. కోర్టులోని కొంతమంది సభ్యుల పట్ల తాను సిగ్గుపడుతున్నానని.
అవసరమైతే టారిఫ్ పెంచుతామే తప్ప రద్దు చేయబోమనీ ప్రకటన. ఆ కొద్దిసేపటికే 10 శాతం అదనపు టారిఫ్ ను విధించడానికి ఉద్దేశించిన ప్రకటనపై సంతకం చేశారు.

ఆంగ్ల సారాంశం

డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపై కొత్త గ్లోబల్ 10 శాతం సుంకాన్ని విధించారు మరియు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. సుప్రీం కోర్ట్ తన పరస్పర సుంకాలను రద్దు చేసిన తర్వాత, ట్రంప్ భారతదేశ వాణిజ్య ఏర్పాటును సమర్థించారు, దీనిని న్యాయంగా పిలిచారు మరియు ఒప్పందం ప్రకారం యునైటెడ్ స్టేట్స్ విధులను ఎదుర్కోదని పునరుద్ఘాటించారు.

Source link