seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 9:16 am Digital Edition : SEEMA KIRANAM

సీమ రైతు కన్నీటి వేత పుస్తకం ఆవిష్కరణ

రాయలసీమకు మరింత సేవ చేసే అదృష్టం, శక్తి ఇవ్వాలని ఆ దేవుళ్లను ప్రార్థిస్తున్నా

 

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి

 

కర్నూలు ప్రతినిధి, జూలై 19, (సీమకిరణం న్యూస్):

నా రాయలసీమకు మరింత సేవ చేసే అదృష్టం, ఎక్కువ శక్తి ఇవ్వాలని ఆ దేవుళ్లను ప్రార్థిస్తున్నానని రాయలసీమ ఉద్యమనేత, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు టి.జి.వి. కళాక్షేత్రంలో రచయిత పత్తి ఓబులయ్య రచించిన “సీమ రైతు కన్నీటి వేత” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రాయలసీమ ఉద్యమనేత, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ రచయిత పత్తి ఓబులయ్య రచించిన సీమ రైతు కన్నీటి వేత పుస్తకం ఆవిష్కరణ చేయడం, అది నా పేరుకు అంకితం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రాయలసీమకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రైతుల కష్టాలు, సీమ ప్రాంత ప్రజల సమస్యలు సమాజానికి తెలియజేసే ఇటువంటి రచనలు మరింత అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, సీమ అభివృద్ధి పట్ల తమ కట్టుబాటు ఎల్లప్పుడూ కొనసాగుతుందన్నారు. పత్తి. ఓబుళపతి రచయితగా, కవిగా, పౌరాణిక కళాకారుడుగా, సాహిత్యంలో ఎంతో అనుభవం ఉందని, రాబోవు రాయలసీమ తరానికి, యువతకు మేలు చేసేవి, చైతన్య కలిగించే మరిన్ని పుస్తకాలు, పాటలు అవసరం అని బైరెడ్డి అన్నారు. కర్నూలు టి. జి. వి కళాక్షేత్రం ద్వారా భవిష్యత్ కళాకారులు తయారు కావాలని, ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయని, మరిన్ని రావాలని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, రాయలసీమ ఉద్యమ నాయకులు టి. జి. వెంకటేష్ సమక్షంలో రచయిత పత్తి. ఓబుళపతి రచించిన సీమ రైతు కన్నీటి వేత పుస్తకం తనకు అంకితం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. రాయలసీమ యువత కోసం తాను కొత్త ప్రాజెక్టు నెలకొల్పి అన్ని రంగాల్లో రాయలసీమ ఉద్యమం బలోపేతం చేసి రాయలసీమకు నీళ్లు, నిధులు, నియమకాలు, సమాన వాటా సాధించేలా మా కొత్త ప్రాజెక్టు లక్ష్యంమని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు, రచయితలు, కవులను, రాయలసీమ ఉద్యమకారులను బైరెడ్డి రాజశేఖరరెడ్డి అభినందించారు.