సీమకిరణం ఎఫెక్ట్ : అధికారుల స్పందన… సమస్య పరిష్కారం
సీమకిరణం పత్రికలో కథనానికి స్పందన..మురికి కాలువలు శుభ్రం.. పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించిన పంచాయతీ అధికారి కె.లక్ష్మి నాధ్ వెల్దుర్తి, మార్చి 07, (సీమకిరణం న్యూస్): సీమకిరణం తెలుగు దినపత్రికలో అధ్వానంగా మారిన మురికి కాలువలు అనే శీర్షిక శుక్రవారం ప్రచురితం అయ్యింది. శనివారం అధికారులు స్పందించి పారిశుధ్య కార్మికులతో మురికి కాలువలను శుభ్రం చేయించారు. దీంతో వెల్దుర్తి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.