Saturday, April 4, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణసిద్దిపేట నుంచే హరీష్ పై పోటీ, BRS ఇక ఉండదు - కవిత సంచలనం..!! |...

సిద్దిపేట నుంచే హరీష్ పై పోటీ, BRS ఇక ఉండదు – కవిత సంచలనం..!! | వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీష్ రావుపై పోటీ చేయాలని జాగృతి కవిత సంచలన నిర్ణయం

📰 Generate e-Paper Clip


తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఖాయమైంది. మేలో కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ఈ మేరకు కస రత్తు జరుగుతోంది. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అసెంబ్లీ స్థానం పైన కవిత తాజాగా స్పష్టత ఇచ్చారు. భవిష్యత్ లో బీజేపీ.. బీఆర్ఎస్ ఉండవంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే.. బీఆర్ఎస్ లక్ష్యంగా తన పార్టీ అభ్యర్దులను పోటీకి దించేలా ప్లాన్స్ సిద్దం చేసింది. త్వరలోనే రాజకీయంగా తన కార్యాచరణ ప్రకటించేందుకు కవిత సమయం అవుతున్నారు.

జాగృతి అధ్యక్షురాలు.. కేసీఆర్ కుమార్తె కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేసారు. తన తొలి ప్రాధాన్యత సిద్దిపేట.. రెండో ప్రాధాన్యత బోధనగా ఉందని. సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని, 2029 ఎన్నికల్లో ఈ రెండు నియోజక వర్గాల్లో పోటీ చేద్దామని చెప్పిన కవిత.. ప్రజలు సూచించిన పేరునే తన పార్టీకి పెడతామని తేల్చి చెప్పారు. తన కొత్త పార్టీ గురించి ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుందని.. ఎన్నికల సంఘం వద్ద ప్రాసెస్ జరుగుతుందని వివరించారు. కాగా.. భవిష్యత్ లో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిప క్షమని కవిత చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒకప్పుడు మంత్రులు ఎర్రవల్లికి పోయేవారని.. ఇప్పుడు ఢిల్లీకి పోతున్నారని. కాగా… కవిత తాజా కార్యాచరణను గమనిస్తే.. బీఆర్ఎస్ లక్ష్యంగా పావులు కడుపుతున్నట్లు స్పష్టం అవుతోంది. హరీష్ నియోజకవర్గం ఎంపిక వెనుక కవిత భారీ టార్గెట్.

వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీష్ రావుపై పోటీకి జాగృతి కవిత సంచలన నిర్ణయం

హరీష్ లక్ష్యంగా సిద్దిపేట నుంచి పోటీ

కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నాటి నుంచి హరీష్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. సిద్ధిపేట ఎవరి జాగీరు కాదని ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేట ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకున్నారని గతంలోనే కవిత. 2028లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమని తాజా వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది. అదే విధంగా కేసీఆర్ కుమార్తెగా సిద్దిపేట లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని. అంతే కాదు ఎక్కువ సార్లు గెలిచినందువల్ల హరీష్ రావు మీద ఇంకెంబెన్సీ కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి మాస్టర్ ప్లాన్ తోనే కవిత ముందుకు సాగుతున్నదని స్పష్టం అవుతోంది. అయితే… బీఆర్ఎస్, బీజేపీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యల వెనుక అసలు టార్గెట్ ఎవరనేది క్లారిటీ ఇస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటన తరువాత కవిత తన రాజకీయ లక్ష్యం.. భవిష్యత్ ప్రణాళికల పైన స్పష్టత ఇవ్వనున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular