తెలంగాణ
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->సికింద్రాబాద్- సప్త జ్యోతిర్లింగ పర్యాటక ప్రత్యేక రైలు: సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శనం పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మహాకాళేశ్వరం- ఓంకారేశ్వరం- త్రయంబకేశ్వరం వంటి సప్త జ్యోతిర్లింగ పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 10 రాత్రులు/ 11 పగళ్లు సాగే యాత్ర స్పెషల్ ఇది.
ఏప్రిల్ 14వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 702 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్- 160, 3ఏసీ- 490, 2ఏసీ- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, హుజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్‌లో హాల్ట్ ఉంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

మొదట ఉజ్జయినీలో వెలిసిన మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగ ఆలయాలను దర్శించుకోవచ్చు. అక్కడ ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం గుజరాత్ లోని ద్వారకాకు బయలుదేరి వెళ్తుంది ఈ ఎక్స్ ప్రెస్. అక్కడ నాగేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకునే వెసలుబాటు ఉంది. అక్కడి నుంచి సోమనాథ్ వెళ్తుంది. అక్కడ- జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథేశ్వరుడిని యాత్రీకులు సేవించుకోవచ్చు.
ఆ తర్వాత మహారాష్ట్రలోని పుణేకు చేరుకుంటుంది ఈ భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్. అక్కడ భీమశంకరం ఆలయదర్శనం ఉంటుంది. ఆ తర్వాతి గమ్యస్థానం.. నాసిక్. నాసిక్ సమీపంలోని పశ్చిమ కనుమల్లో వెలిసిన ప్రఖ్యాత త్రయంబకేశ్వరాన్ని భక్తులు దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు ఈ ఐఆర్సీసీ ఈ టూర్ ద్వారా. దీని తర్వాత నేరుగా ఔరంగాబాద్ వెళ్తారు. ఘృష్ణేశ్వరుడిని దర్శిస్తారు. దీంతో ఈ యాత్ర పూర్తవుతుంది. ఔరంగాబాద్ నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 17,600 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాలలోపు వారికి 16,300 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 26,700, పిల్లలకు 25,200 రూపాయలు, కంఫర్ట్ కేటగిరి (2ఏసీ)లో పెద్దలకు 34,600, పిల్లలకు 32,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రైలు టిక్కెట్లు, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనం, ఇన్సూరెన్స్ ఉంటాయి.
ఆంగ్ల సారాంశం
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏప్రిల్ 14న సికింద్రాబాద్ నుండి భరత్ గౌరవ్ చే సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రను అందిస్తోంది. కేవలం రూ. 17,600తో ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే అనుభూతి కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. మహాకాళేశ్వరం- ఓంకారేశ్వరం వంటి సప్త జ్యోతిర్లింగ పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు.