seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 5:28 am Digital Edition : SEEMA KIRANAM

సస్పెండ్ అయినా తహసీల్దార్ రైలు కింద పడి ఆత్మహత్య

సస్పెండ్ అయినా తహసీల్దార్ రైలు కింద పడి ఆత్మహత్య

 

లక్కిరెడ్డిపల్లి మండలంలో విధులు నిర్వహించి ఇటీవల సస్పెండ్ అయిన తహసీల్దార్ శ్రీనివాసులు గురువారం రాత్రి చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.