వ్యాపారం
ఓయి-లింగారెడ్డి గజ్జల
<!--
--> <!-- -->అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగ సంస్థలు మహిళల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. మహిళల ఆర్థిక ఎదుగుదల, ఆరోగ్యం మరియు వ్యాపార కలలను ప్రోత్సహించేలా యెస్ బ్యాంక్ (యస్ బ్యాంక్), ఎస్‌బీఐ (SBI), మరియు ఎల్‌అండ్ టీ ఫైనాన్స్ (L&T ఫైనాన్స్) సరికొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. ఆ వివరాలు మీకోసం:
ప్రైవేట్ బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ‘యెస్ ఎసెన్స్ ఉమెన్స్ శారీ అకౌంట్’ను ప్రవేశపెట్టింది. వారి జీవనశైలికి తగ్గట్టుగా రూపొందించిన ఈ ఖాతా ద్వారా మొదటి ఏడాది ఉచిత లాకర్ సౌకర్యం లభిస్తుంది. అదనంగా, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రూ.5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఏడాదికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ ఖాతాతో పాటు ఇచ్చే ‘ఎలిజెన్స్ డెబిట్ కార్డ్’ ద్వారా షాపింగ్ చేసే వారు ఏడాదికి రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.

మహిళా సాధికారతకు ఎస్‌బీఐ..
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మహిళల ఆర్థిక భరోసా కోసం ఏకంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,590 కోట్లు) సామాజిక రుణ నిధిని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లింగ సమానత్వం మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఈ నిధులను వెచ్చించనున్నారు. పారిశ్రామిక మహిళావేత్తలకు, స్వయం ఉపాధి పొందే వారికి రుణ సాయం అందించడం ద్వారా సామాజిక మార్పు తీసుకురావడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు.
ఎల్‌అండ్‌టీ ‘స్ఫూర్తి’..
సొంత ఇల్లు వ్యాపార స్థలం కొనుగోలు చేయడానికి లేదా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎల్‌అండ్ టీ ఫైనాన్స్ ‘స్ఫూర్తి’ అనే ప్రత్యేక గృహ రుణ పథకం ప్రారంభించింది. వ్యాపారంలో 50 శాతం వాటా ఉంటుంది, ఏడాదికి కనీసం రూ.5 లక్షల లాభం పొందే మహిళలు ఈ రుణానికి అర్హులు. దీని ద్వారా తక్కువ వడ్డీకే రూ.75 లక్షల వరకు రుణం పొందవచ్చు. గృహ రుణాలకైతే 25 ఏళ్లు, వ్యాపార ఆస్తుల హామీతో తీసుకునే రుణాలకు 12 ఏళ్ల కాలపరిమితిని సంస్థ అందిస్తోంది. మహిళల ఆర్థిక స్వేచ్ఛకు ఈ పథకం ఒక గొప్ప ఊతాన్ని ఉందని నిపుణులు.
ఆంగ్ల సారాంశం
ప్రధాన ఆర్థిక ప్రోత్సాహకాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోండి! యెస్ బ్యాంక్ యొక్క ఎసెన్స్ శాలరీ ఖాతా, లింగ సమానత్వం కోసం SBI యొక్క రూ. 4,590 కోట్ల సామాజిక రుణం మరియు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన L&T ఫైనాన్స్ స్పూర్తి గృహ రుణ పథకాన్ని కనుగొనండి