సమగ్ర శిక్షా ఉద్యోగులకు జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్లు ప్రారంభం
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 21 (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులకు శాలరీ అకౌంట్లు తెరిచారు. ఉద్యోగులకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మధు, సమగ్ర శిక్షా కర్నూలు జిల్లా జేఏసీ కమిటీ చైర్మన్ ఎం. చంద్రశేఖర్ రాజు, కోఆర్డినేటర్ మధు సహకరించారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంక్షేమానికి సహకరించిన యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మధుకు, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సమగ్ర శిక్షా కర్నూలు జిల్లా జేఏసీ కమిటీ తరఫున చైర్మన్ ఎం. చంద్రశేఖర్ రాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.