seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 2:47 pm Digital Edition : SEEMA KIRANAM

సచివాలయం ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై సస్పెన్షన్ వేటు తప్పదు

డోన్ మున్సిపల్  కమిషనర్ ప్రసాద్ గౌడ్

సచివాలయం ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

డోన్, ఫిబ్రవరి 03, (సీమకిరణం న్యూస్):

ప్రభుత్వం ఇచ్చిన సర్వేలను మరియు అధికారుల ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తూ సచివాలయ ఉద్యోగులు వారి పనులను చేయనందుకు, సచివాలయాల్లో మరియు వారికి కేటాయించిన వార్డులలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు 8 మంది సచివాలయం ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగిందని, ఇకపై ఎవరైనా వారి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వారిపై సస్పెన్షన్ వేటు తప్పదని, సస్పెండ్ అయిన వారు వారికి కేటాయించిన సర్వేలను పూర్తి చేసిన ఎడల వారి సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవడం జరుగునని, అలాగే ప్రతి సచివాలయంలో మునిసిపాలిటీకి సంబంధించిన ఒక రెగ్యులర్ ఉద్యోగి మరియు ఇద్దరు ఆర్పీలను సహాయార్థం నియమించడం జరిగిందని, ప్రభుత్వం ఇచ్చిన సర్వేలను తప్పక పూర్తి చేసి తీరుతామని డోన్ మున్సిపల్  కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. సక్రమంగా పనులు చేయని సచివాలయం ఉద్యోగులకు ఛార్జ్ మెమోలు, షోకాజ్ నోటీసులను పలుమార్లు ఇవ్వడం జరిగిందని మార్పు లేని వారి పై సస్పెన్షన్ వేటు తప్పదని మునిసిపల్ కమిషనర్ హెచ్చరించారు.