వృద్ధురాలిపై దాడి
తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు
తీవ్ర భయాందోళనలో గ్రామస్థులు
పొలాల పనులకు వెళ్లలేకపోతున్న రైతులు
అనంతపురం ప్రతినిధి, ఫిబ్రవరి 02, (సీమకిరణం న్యూస్):
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సంజీవపురంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.పొలం పనులకు వెళ్లిన ఓ వృద్ధురాలిపై చిరుత దాడి చేయడం సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్ముమ్మ(60)పై చిరుత దాడి చేయగా, ఆమె తృటిలో తప్పించుకున్నారు. చెవి కింది భాగం, చేతులపై రక్కిన చిరుత.. బలమైన గాయం చేయడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిరుత దాడి ఘటనతో మండలమంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లలేకపోతున్న రైతులు.. పంటలను ఎండబెట్టివలసి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. అటవీ అధికారులు తక్షణం స్పందించాల్సి ఉంది.

