తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->మహా శివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం పెద్ద సంఖ్యలో అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. 43 శైవ క్షేత్రాలకు రాక పోకలు సాగేందుకు ప్రత్యేక బస్సులు ప్రకటించారు. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ టికెట్ ధరలను సవరించింది. మహాలక్ష్మీ పథకం ఈ బస్సుల్లోనూ అమలులో ఉంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి శ్రీశైలం కు బస్సులను ఖరారు చేసింది. శివరాత్రి ప్రత్యేక బస్సులు ఈ నెల 14 నుంచి 16 వరకు అందుబాటులో ఉన్నాయి.
మహా శివరాత్రి పర్వదినం వేళ భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమాహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, ఇతర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.
శ్రీశైలం కు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లే అవకాశం ఉంది.. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ తో పాటుగా హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఐ, ఐఎస్ సదన్, కేపీహెచ్.బీ, బీహెచ్ ఈఎల్ నుంచి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించారు.. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ చార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సవరించిన ఛార్జీలు ఈ నెల 14 నుంచి 16 తేదీ వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే అమల్లో ఉంటాయి.

ఈ బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం కొనసాగింపు
ప్రయాణీకులకు సమాచారం తెలిపే విధంగా స్పెషల్ సర్వీసులకు బస్సులకు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్‌లను సైతం ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గత శివరాత్రితో పోల్చితే ఈ సారి 208 బస్సుల ను అదనంగా సంస్థ నడపనుంది. మహాలక్ష్మీ పథకం అమల్లో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. ముందస్తు బుకింగ్‌లను www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అదే విధంగా మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
ఆంగ్ల సారాంశం
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 43 శైవ పుణ్యక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను TSRTC నడపనుంది.