శబ్ద కాలుష్యంపై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల కొరడా
శబ్ద కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసుల కొరడా 55 వాహనాలపై ఈ-చలాన్లు.. మోడిఫైడ్ సైలెన్సర్లు, హారన్లు తొలగింపు కర్నూలు క్రైమ్, ఆగస్టు 24 (సీమకిరణం న్యూస్): కర్నూలు నగరంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం ఓల్డ్ పీసీఆర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్న ఐదు ద్విచక్ర వాహనాలను...